NewsOrbit
Entertainment News సినిమా

Chiranjeevi Balakrishna: బాలకృష్ణ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ తో మెగాస్టార్ చిరంజీవి మూవీ..?

Share

Chiranjeevi Balakrishna: నటసింహ నందమూరి బాలయ్య బాబు వరుసపరజయలతో ఉన్న సమయంలో బోయపాటితో తీసిన “సింహ” సినిమా బాలకృష్ణకి మంచి బ్రేక్ ఇచ్చింది. 2010లో వచ్చిన ఈ సినిమా అనేక రికార్డులు క్రియేట్ చేయడం జరిగింది. ఈ సినిమాకి ముందు వరుస పరాజయాలతో సతమతమయ్యారు. “లక్ష్మీనరసింహ” వంటి బ్లాక్ పాస్టర్ తర్వాత మరో హిట్టు పట్టడానికి దాదాపు కొన్ని సంవత్సరాలు పాటు బాలయ్య ఇబ్బందులు ఎదుర్కోవటం జరిగింది. అటువంటి సమయంలో బోయపాటి “సింహా” తో మంచి బ్రేక్ ఇచ్చారు. ఆ తర్వాత 2014 ఎన్నికల సమయంలో “లెజెండ్” సినిమాతో రెండో హిట్టు ఇవ్వటం జరిగింది. తర్వాత “అఖండ” సినిమాతో బాలకృష్ణతో హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ విజయం బోయపాటి సొంతం చేసుకున్నారు. హీరోని మంచి మాస్ నేపథ్యంలో చూపించడంలో బోయపాటి తీరు వేరు.

Megastar Chiranjeevi movie with blockbuster director Balakrishna

అటువంటి బోయపాటితో ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి సినిమా చేయటానికి రెడీ అయినట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. ఇటీవలే చిరంజీవి మెహర్ రమేష్ తో “భోళా శంకర్” చేసి అట్టర్ ప్లాప్ అందుకున్నారు. అంతకుముందు గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్యలతో 2 బ్యాక్ టు బ్యాక్ విజయాలను.. అందుకుని “భోళా శంకర్” తో బోల్తాపడటం జరిగింది. ప్రస్తుతం వశిష్టతో చిరంజీవి సినిమా చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే సమయంలో మరోపక్క కథలు వింటూ ఉన్నారు. అయితే ఇటీవల బోయపాటి ప్రత్యేకంగా చిరంజీవి కోసం ఓ స్టోరీ సిద్ధం చేసి ఆయనకు వినిపించడం జరిగిందంట. అంతా బాగానే ఉండటంతో చిరంజీవి కూడా ఓకే చెప్పినట్లు త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన చేయనున్నట్లు సమాచారం.

Megastar Chiranjeevi movie with blockbuster director Balakrishna

ఇదిలా ఉంటే ఇటీవల బోయపాటి ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్ పోతినేని తో “స్కంద” అనే సినిమా చేయడం జరిగింది. ఈ సినిమా అంతగా ప్రేక్షకులను అలరించలేదు. పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ సొంతం చేసుకోంది. అయితే చిరంజీవితో చేయబోయేది తెలుగులో మాత్రమే విడుదలయ్యే సినిమా అని సమాచారం. చిరంజీవితో పాటు బాలకృష్ణతో కూడా బోయపాటి 2024 ఎన్నికలకు ముందే సినిమా చేయబోతున్నట్లు మరోపక్క ప్రచారం జరుగుతుంది. మరి ఈ ఇద్దరు స్టార్ హీరోల ప్రాజెక్టులలో ఎవరిది బోయపాటి ముందు మొదలు పెడతాడో అనేది సస్పెన్స్ గా మారింది.


Share

Related posts

`సీతారామం` వంటి బిగ్ హిట్‌ను చేతులారా వ‌దులుకున్న యంగ్ హీరోలు వీళ్లే?!

kavya N

Rajamouli : రాజమౌళి ముఖ్య అతిథిగా ఛత్రపతి హిందీ రీమేక్ కి ముహూర్తం ఫిక్స్

GRK

Rajusrivastava: 40 రోజులు ప్రాణాలతో పోరాడి మృతి చెందిన కమెడియన్ రాజు శ్రీవాస్తవ..!!

sekhar