21.2 C
Hyderabad
December 8, 2022
NewsOrbit
Entertainment News సినిమా

Allu Studio: మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా అల్లు స్టూడియో ప్రారంభం..!!

Share

Allu Studio: స్వర్గీయ అల్లు రామలింగయ్య 100వ జయంతి సందర్భంగా హైదరాబాదు నగరం నడిబొడ్డున అల్లు స్టూడియో ప్రారంభించడం జరిగింది. గండిపేట్ లో దాదాపు పది ఎకరాల్లో ఈ స్టూడియో అని అల్లు ఫ్యామిలి ఏర్పాటు చేస్తుంది. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా స్టూడియోని ప్రారంభించడం జరిగింది. శత జయంతిలో భాగంగా జరిగిన స్టూడియో ప్రారంభోత్సవ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి దంపతులతో పాటు అల్లుకుటుంబ సభ్యులు హాజరయ్యారు. అల్లు అర్జున్, అల్లు శిరీష్, అల్లు బాబీ ఇంకా పలువురు కుటుంబ సభ్యుల హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ .. అల్లు రామలింగయ్య శత జయంతి సందర్భంగా ఆయనకు నా నివాళి. ఎంతోమంది నటులు ఉన్నాగాని ఇటువంటి అరుదైన ఘనత కొద్దిమందికే లభిస్తుంది. దానికి కారణం అల్లు రామలింగయ్య కుమారులు లేదా మనవాళ్ళు అని చెప్పవచ్చు. ఇదంతా అదృష్టంగా భావిస్తున్నాను.

Megastar Chiranjeevi started Allu Studio
Chiranjeevi

అల్లు రామలింగ వేసిన బాటలో నిర్మాతగా అల్లు అరవింద్ ఇంకా హీరోలుగా బన్నీ, శిరీష్, బాబి ఇదే సినిమా రంగంలో కొనసాగుతూ అగ్రస్థానంలో ఉన్నారంటే ఆనాడు పాలకొల్లులో అల్లు రామలింగయ్య గారు తీసుకున్న నిర్ణయం. నటుడిగా నేను ఉనికిని చాటుకోవాలి..? మద్రాస్ వెళ్లాలి..? ఇండస్ట్రీలో నెల తొక్కుకోవాలి అని బలియమైనట్టి ఆయన ఆలోచన ఈరోజు ఒక పెద్ద వ్యవస్థగా మారింది. ఇందుకు గాను అల్లు కుటుంబ సభ్యులు తరతరాలు తలుచుకుంటూ ఉండాలి. కొడుకు అల్లు అరవింద్ నీ నిర్మాతగా చేయడానికి గత ఆర్ట్స్ స్థాపించగా తండ్రి ఆశీస్సులు పొందుకున్న అల్లు అరవింద్… నేడు ఇండస్ట్రీలో అగ్ర నిర్మాతలలో ఒకరిగా రాణిస్తున్నారు. ఇక అరవింద్ ముగ్గురు కుమారులు కూడా విజయవంతంగా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు.

Megastar Chiranjeevi started Allu Studio
Chiranjeevi

ఇక స్టూడియో అనేది లాభాపేక్ష గురించి నిర్మించింది అని నేను అనుకోవడం లేదు. అల్లు స్టూడియోని అల్లు రామలింగయ్యా పట్ల కృతజ్ఞత చూపించుకునే దిశగా ఈతరమే కాదు రాబోయే తరాలు కూడా… ఉండాలని కోరుకుంటున్నట్లు చిరంజీవి తెలిపారు. అల్లు రామలింగయ్య గారిని తరతరాలు తలుచుకునే రీతిలో ఈ స్టూడియోని నిర్మించిన.. అల్లు అరవింద్ ఇంకా అల్లు అర్జున్, బాబీ, శీరీష్ లకు అందరికీ హృదయపూర్వక అభినందనలు అని చిరంజీవి తన స్పీచ్ ఇచ్చారు. ముంబైలో “గాడ్ ఫాదర్” ప్రమోషన్ కార్యక్రమం ఉంది. కనుక.. చాలా త్వరగా మాట్లాడాల్సి వచ్చిందని మిగతా కార్యక్రమంలో సాయంత్రం మళ్లీ మాట్లాడతానని చిరంజీవి తెలిపారు.


Share

Related posts

Krithi Shetty Uppena Movie Events Half Saree Pictures

Gallery Desk

Akhanda: గోపీచంద్ మలినేని సినిమాకి “అఖండ” సెంటిమెంట్ ఫాలో అవుతున్న బాలయ్య బాబు..??

sekhar

Acharya: మెగా ఫాన్స్‌కు ఇది బ్యాడ్ న్యూసేనా..!

GRK