ఆ డైరెక్టర్ తో హ్యాట్రిక్ ప్లాన్ చేసిన మెగాస్టార్ చిరంజీవి..??

టాలీవుడ్ ఇండస్ట్రీలో కుర్ర హీరోలకు ఏ మాత్రం తీసిపోకుండా మెగాస్టార్ చిరంజీవి ఫుల్ స్వింగ్ లో ఉన్నారు. ఒక సినిమా షూటింగ్ జరుగుతూ ఉండగానే మిగతా సినిమాలను లైన్ లో పెట్టేస్తున్నారు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో “ఆచార్య” పనులలో బిజీగా ఉన్న చిరు…. ఆ నెక్స్ట్ చేయబోయే సినిమాలను కూడా రెడీ చేస్తున్నారు. ఈ క్రమంలో తమిళ హిట్ వేదాళం తో పాటు మలయాళం బ్లాక్ బస్టర్ లూసిఫర్ సినిమాని రీమేక్ చేస్తున్నారు మెగాస్టార్. ప్రస్తుతం ఈ రెండు సినిమాల స్క్రిప్ట్ ఫైనల్ చేసే పనిలో ఉంది మెగా కాంపౌండ్. మెగా స్టార్ ఇమేజ్ తో పాటు తెలుగు నేటివిటీ ని దృష్టిలో పెట్టుకుని ఈ స్క్రిప్ట్ లకి తుదిమెరుగులు దిద్దుతున్నారట.

Chiranjeevi in Confusion?ఇదిలా ఉండగా తాజాగా “లూసిఫర్” రీమేక్ కి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇండస్ట్రీ లో వైరల్ అవుతుంది. ఈ మూవీని సాహోసినిమా ఫ్రేమ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం చేస్తారని వార్తలు వినిపించిన… ఫైనల్ గా వివి వినాయక్ కి చిరంజీవి ఫిక్స్ అయినట్లు సమాచారం. గతంలో రీమేక్ లతో బ్లాక్ బస్టర్ లు ఇచ్చిన వి.వి.వినాయక్… లూసిఫర్ సినిమాతో హ్యాట్రిక్ ప్లాన్ చేస్తున్నారట. అందుకు తగ్గట్టు ఇప్పుడు వివి వినాయక్ స్క్రిప్ట్ విషయంలో మార్పులు చేస్తున్నట్లు సమాచారం.

 

ఒరిజినల్ లో లేని కొన్ని క్యారెక్టర్స్ మరియు కొత్త సన్నివేశాలు సినిమాలో ఉండేలా  వినాయక్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్. ఒరిజినల్ గా “లూసిఫర్” సినిమాలో హీరోకి హీరోయిన్ వుండదు. కానీ ఈ సినిమాలో చిరంజీవికి హీరోయిన్ ఉండేలా స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు వినాయక్ చేస్తున్నట్లు సమాచారం. గతంలో ఠాగూర్, ఖైదీ నెంబర్ 150 సినిమాలు సూపర్ డూపర్ హిట్ అవడంతో ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టడానికి చిరు వినాయక్ డిసైడ్ అయినట్లు సమాచారం.