Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ముద్దుల కూతురు సుష్మిత కొణిదెల చాలా కాలంగా ఇండస్ట్రీలో తన పాత్రను పోషిస్తున్నారు. ముఖ్యంగా చరణ్, చిరంజీవి సినిమాలకు ఈమె కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేస్తూ ఉంటుంది. అయితే తాజాగా ఇప్పుడు ఆమె ‘గోల్డ్ బాక్స్’ అనే నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి సినిమాలను నిర్మిస్తున్న విషయం మనకు విదితమే. గోల్డ్ బాక్స్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లో మొదటగా సుష్మిత కొణిదెల ఒక వెబ్ సిరీస్ ను నిర్మించగా, ఆ వెబ్ సిరీస్ కు మంచి పేరు వచ్చింది. ఆ వెబ్ సిరీస్ తెచ్చిన పేరుతో ఆమె సినిమాల నిర్మాణం పై దృష్టి పెట్టింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
Chiranjeevi: మెగాస్టార్ సపోర్ట్
కేవలం సినిమా ప్రమోషన్ మాత్రమే కాకుండా కూతురు నిర్మాణ సంస్థను కూడా ప్రమోట్ చేసేందుకు మెగా స్టార్ సిద్ధం అయ్యాడు. ఈ గోల్డ్ బాక్స్ బ్యానర్ లో ఒక సినిమాను చేసేందుకు చిరంజీవి ఓకే చెప్పాడని విశ్వసనీయ వర్గాల సమాచారం. కథ మరియు దర్శకుడు సెట్ అయితే గోల్డ్ బాక్స్ బ్యానర్ లో కూతురు కోసం సినిమాను చేసేందుకు గాను చిరంజీవి ఓకే చెప్పడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నారు. చిరంజీవి సినిమా అంటే మినిమం 60 నుండి 80 కోట్ల బడ్జెట్ ఉంటుంది. అయితే సుష్మిత ఆ స్థాయిలో పెట్టనవసరం లేకుండా తన పారితోషికం మొత్తాన్ని కూడా రద్దు చేసుకునేందుకు చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా గుసగుసలు వినబడుతున్నాయి.