NewsOrbit
Entertainment News సినిమా

Chiranjeevi: మనవరాలపై మీడియా సమక్షంలో మెగాస్టార్ చిరంజీవి భావోద్వేగకరమైన వ్యాఖ్యలు..!!

Advertisements
Share

Chiranjeevi: వివాహం చేసుకున్న 11 సంవత్సరాల తర్వాత రామ్ చరణ్ ఉపాసన దంపతులకు.. నేడు ఉదయం ఆడబిడ్డ పుట్టడం తెలిసిందే. దీంతో చాలా కాలం తర్వాత ఈ జంట కి మొదటి సంతానం కలగడంతో మెగా కుటుంబంలో సంబరాలు అంబరానంటాయి. నిన్న రాత్రి జూబ్లీహిల్స్ నందు అపోలో ఆసుపత్రిలో డెలివరీకి జాయిన్ అయినా ఉపాసన జూన్ 20వ తారీకు ఉదయం 1: 49 నిమిషాలకు ఆడబిడ్డకు జన్మనివ్వడం జరిగింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మీడియా సమక్షంలో మనవరాలను ఉద్దేశించి మెగాస్టార్ చిరంజీవి చాలా బాగోద్వేగాకరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ ఆడబిడ్డ పుట్టుక తమ కుటుంబానికి ఎంతో అపురూపమని స్పష్టం చేశారు. దానికి కారణం ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళిద్దరూ తల్లిదండ్రులు కావాలని.. మా చేతిలో బిడ్డను పెట్టాలని కోరుకోవడం జరిగింది.

Advertisements

Megastar Chiranjeevi's emotional comments on granddaughters in front of media

అది ఇన్నేళ్ల తర్వాత ఆ భగవంతుని దయ వలన అందరి ఆశీస్సుల వలన నెరవేరింది. అందువలనే..ఈ ఆడబిడ్డ జన్మించటం అనేది.. తమ కుటుంబానికి అపురూపం మరియు సంతోషం. ఈ సందర్భంగా ఇతర దేశాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి మా బంధువులు మరియు స్నేహితులు.. సన్నిహితులు శ్రేయోభిలాషులు ఆత్మీయులు అదేవిధంగా మా సంతోషాన్ని తమ సంతోషంగా భావించే అభిమానులు… ఆయా రకాలుగా వివిధ రూపాల్లో తమ శుభాకాంక్షలు సంతోషాన్ని అందజేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి మా కుటుంబంలో ఉన్న అందరి తరపున నా సంతోషాన్ని ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

Advertisements

Megastar Chiranjeevi's emotional comments on granddaughters in front of media

మరి ముఖ్యంగా మా ఇష్ట దైవం ఆంజనేయ స్వామి ఇష్టపడే మంగళవారం రోజు పాప కొట్టడం నిజంగా భగవంతుడు కరుణించిన రోజు అని.. భావిస్తున్నట్లు చిరంజీవి స్పష్టం చేశారు. అంతేకాదు పాప గర్భంలో ఉన్నప్పుడే ప్రభావం బాగా కనపడింది. చరణ్ గ్లోబల్ స్టార్ ఎదగటం.. మరో పక్క వరుణ్ తేజ్ నిశ్చితార్థం జరగటం చాలా వరకు శుభ సూచికలు కుటుంబంలో జరిగాయి అని తెలియజేశారు. ఇదిలా ఉంటే మెగా ప్రిన్సెస్ అంటూ చరణ్ ఉపాసనల… కూతురు ట్రెండింగ్ చేస్తూ అభిమానులు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలియబరుస్తున్నారు.


Share
Advertisements

Related posts

poorna New gorgeous pics

Gallery Desk

Kanti papa kanti papa : వకీల్ సాబ్ మూవీ నుంచి రొమాంటిక్ సాంగ్ అదుర్స్..!!

bharani jella

Gangubai Kathiawadi: ఆలియా భట్ “గంగుభాయ్ కతీయావాడి” షూటింగ్ కంప్లీట్..!! రిలీజ్ డేట్ ఎప్పుడంటే..!?

bharani jella