న్యూస్ సినిమా

Bhola Shankar: షూటింగులో దర్శకుడికి చమటలు పట్టిస్తున్న మెగాస్టార్..!

Share

Bhola Shankar: మెగాస్టార్ చిరంజీవి హీరోగా భోళా శంకర్ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన కమిటైన సినిమాలలో భోళా శంకర్ ఒకటి. చాలా కాలంగా ఇండస్ట్రీలో అవకాశాలు లేకుండా ఉన్న దర్శకుడు మెహర్ రమేశ్‌కు మెగాస్టార్ అవకాశం ఇవ్వడం అందరికి పెద్ద షాకింగ్ విషయం. అయితే మేకింగ్ పరంగా మెహర్ రమేశ్ మీద అందరికీ మంచి అభిప్రాయం ఉంది. అదే ఇప్పుడు మెగాస్టార్ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం తెచ్చిపెట్టింది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ రీసెంట్‌గా మొదలుపెట్టి శరవేగంగా చిత్రీకరణను జరుపుతున్నారు. హ్యూమన్ ఎమోషన్స్ ను టచ్ చేస్తూ సాగే మాస్ యాక్షన్ కథగా ఈ సినిమా రూపొందుతోంది.

megastar joined in bhola shankar shooting
megastar joined in bhola shankar shooting

తమిళ స్టార్ హీరో అజిత్ నటించిన బ్లాక్ బస్టర్ ‘వేదాళం’ సినిమాకి అధికారిక తెలుగు రీమేక్ భోళా శంకర్. ఈ మూవీ కథ ఎక్కువగా అన్నా – చెల్లెళ్ల సెంటిమెంట్‌తో సాగుతుంది. ఇందులో చెల్లెలి పాత్రకు చాలా ప్రాముఖ్యం ఉంటుంది. అందుకే కీర్తి సురేశ్‌ను ఈ పాత్ర కోసం తీసుకున్నారు. ఇప్పటి వరకు తెరకెక్కించిన సాంగ్, ఫైట్స్ అద్భుతంగా వచ్చాయని దర్శకుడు మెహర్ రమేశ్ ఆ మధ్య తెలిపారు. సాంగ్‌కు వి జె శేఖర్ మాస్టర్ డాన్స్ కొరియోగ్రఫీ అందించారు. అయితే, తాజా సమాచారం రెండ్రోజుల నుంచి మెగాస్టార్ షూటింగ్‌లో జాయిన్ అయ్యారట. ఇటీవల సోషల్ మీడియాలో చిరు వీలైనంత త్వరగా 175 సినిమాలను పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారట.

Bhola Shankar: చిరు సినిమాలు మూడైనా ఈ ఏడాది వచ్చేస్తాయనడంలో సందేహం లేదు.

అందుకే వరుసగా సినిమాలను లైనప్ చేస్తూనే వాటిని చక చకా కంప్లీట్ చేస్తున్నారు. ఇక చిరు షూటింగ్‌లో ఎంత స్పీడ్‌గా ఉంటారో చాలా మందికి తెలీదు. ఒక్కసారి దర్శకుడు సీన్, షాట్ చెప్పగానే సింగిల్ టేక్‌లో ఫినిష్ చేసేస్తారట. ఇప్పుడు భోళా శంకర్ సెట్‌లో చిరు అదే దూకుడుగా సీన్స్ కంప్లీట్ చేస్తున్నారట. దర్శకుడు మెహర్ రమేశ్‌కు చిరు స్పీడ్ చూసి షాకవుతున్నారట. ఎందుకు అందరూ ఆయనతో సినిమా చేయాలని తాపత్రయపడతారో ఇప్పుడు మెహర్ రమేశ్‌కు అర్థమైందని చెప్పుకుంటున్నారు. మొత్తానికి పరిస్థితులు అనుకూలిస్తే చిరు సినిమాలు మూడైనా ఈ ఏడాది వచ్చేస్తాయనడంలో సందేహం లేదు. ఇందులో చిరు సరసన తమన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. మహతి స్వర సాగర్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు.


Share

Related posts

Prabhas: ప్రభాస్ “మిర్చి” సినిమా టైటిల్ ఫస్ట్ ఎవరిదో తెలుసా..??

sekhar

TDP: అచ్చెన్న వీడియో వైరల్ చేసిన వైసీపీ..! జగన్ పై సీరియస్ కామెంట్స్ చేసిన అచ్చెన్న..!!

somaraju sharma

క‌రోనాను అంతం చేసే కుక్కలు.. ఎలాగో తెలుసా?

Teja
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar