NewsOrbit
సినిమా

Mehreen: మెరుపుల డ్ర‌స్‌లో మెంట‌లెక్కిస్తున్న మెహ్రీన్‌.. ఫొటోలు చూస్తే చెమ‌ట‌లే!

Share

Mehreen: మెహ్రీన్ కౌర్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. మోడ‌ల్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ బ్యూటీ.. 2016లో విడుద‌లైన `కృష్ణ గాడి వీర ప్రేమా గాధ` మూవీతో హీరోయిన్‌గా సినీ గ‌డ‌ప తొక్కింది. మంచి విజ‌యం సాధించిన ఈ చిత్రంలో మెహ్రీన్ త‌న‌దైన అందం, అభిన‌యంతో ఆక‌ట్టుకుంది. దీంతో ఆమెకు మ‌రిన్ని అవ‌కాశాలు త‌లుపు త‌ట్టాయి.

ఈ క్ర‌మంలోనే మహానుభావుడు, రాజా ది గ్రేట్, జవాన్, పంతం, కవ‌చం, ఎఫ్ 2తో స‌హా త‌దిత‌ర చిత్రాల్లో న‌టించి స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది. ఓవైపు తెలుగులో న‌టిస్తూనే మ‌రోవైపు త‌మిళ సినిమాలు చేసిన మెహ్రీన్‌.. ఇటీవ‌ల `మంచి రోజులు వ‌చ్చాయి` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది.

ఈ సినిమా ప్రేక్ష‌కులను పెద్ద‌గా ఆక‌ట్టుకోలేక‌పోయింది. ప్ర‌స్తుతం మెహ్రీన్ `ఎఫ్ 3`లో న‌టిస్తోంది. అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈచిత్రంలో విక్టరీ వెంక‌టేష్‌, వ‌రుణ్ తేజ్ హీరోలుగా న‌టించారు. ఇటీవ‌లె షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ మే 27న విడుద‌ల కాబోతోంది.

దీంతో పాటు మ‌రిన్ని ప్రాజెక్ట్స్ కూడా మెహ్రీన్ చేతిలో ఉన్నాయి. ఇక ఎంత బిజీ షెడ్యూల్ ఉన్న‌ప్ప‌టికీ సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మెహ్రీన్‌.. ఎప్ప‌టిక‌ప్పుడు అదిరిపోయే ఫొటో షూట్ల‌తో త‌న ఫాలోవ‌ర్స్‌ను అల‌రిస్తుంటుంది.

అయితే తాజాగా కూడా అదే చేసింది. ఉల్లిపొర లాంటి మెరుపుల డ్ర‌స్‌లో హాట్ హాట్‌గా ఫొటోల‌కు పోజులిచ్చి మెంట‌లెక్కించింది. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైర‌ల్‌గా మారాయి. వీటిని చూస్తే ఎవ్వ‌రికైనా చెమ‌ట‌లే. అంత అందంగా మెహ్రీన్ మైమ‌ర‌పిస్తోంది.


Share

Related posts

సీమరాజాతో రానున్న సమంత…

Siva Prasad

Pawan Kalyan: హరిహర వీరమల్లు కోసం ఎన్ని నెలలు డేట్స్ ఇచ్చాడో తెలిస్తే మైండ్ బ్లాకే..!

GRK

Ashima Narwal Latest Pictures

Gallery Desk