ఇండియన్ సినిమాల్లో మీ టూ ఉద్యమం జోరుగా ఉన్నప్పుడు దక్షిణాదిన సింగర్ చిన్నయి మీ టూ ఉద్యమానికి నాంది లీడ్ తీసుకుంది. ప్రముఖ తమిళ రచయిత వైరముత్తు తనను లైంగికంగా వేధించాడని చెప్పడంతో దక్షిణాది సినిమాల్లో పలువురు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. అయితే దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోగా.. డబ్బింగ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుండి చిన్మయిని తొలగించారు. ఇప్పుడు మరోసారి చిన్మయి ఏకంగా మేనకాగాంధీనికి విషయాన్ని సోషల్ మీడియా ద్వారా చేరవేశారు.
`మేడమ్ నేను వైరముత్తుపై పిర్యాదు చేసి నాలుగు నెలలు అవుతుంది. ఎలాంటి స్పందనా లేదు. తమిళనాడు డబ్బింగ్ అసోసియేషన్ నుండి నన్ను తొలగించారు. దీనికి నాకు పరిష్కారం చెప్పండి` అంటూ మేనకాగాంధీని కోరారు. వెంటనే మేనకాగాంధీ ట్విట్టర్ ద్వారా చిన్మయికి తన సహకారం అందించారు. మీ వివరాలను పంపితే నేను విషయాన్ని జాతీయ మహిళా కమీషన్ దృష్టికి తీసుకెళతానని పేర్కొన్నారు. మరిప్పుడు మహిళా కమీషన్ ఈ వ్యవహారంపై ఎలా స్పందిస్తుందో చూడాలి.
previous post
next post