NewsOrbit
న్యూస్ సినిమా

మైమరపించే “మెలోడీస్” : మిడిల్ క్లాస్ వాళ్లంతా ఎంజాయ్ చేసే సినిమా

 

 

కొన్ని సినిమాలు చూసినప్పుడు మనసుకు హాయిగా ఉంటుంది. మన కథలనే లేదా మనకు తెలిసిన వారి కథలనే చూశామన్న ఫీల్ కలుగుతుంది. పాత్రలో నటించడం, భారీ డైలాగ్స్ చెప్పడం కాదు కేవలం అక్కడ ఉన్నట్లు అనిపిస్తుంది. అలా మనసుకు హాయిగా చూస్తున్నంతసేపు ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా కంటికి అనిపించే సినిమా “మిడిల్ క్లాస్ మెలోడీస్”

 

Middle Class Melodies Movie

ఎవరి పాత్ర వారు కుమ్మేసారు!!

ప్రస్తుత తరానికి, జీవన విధానానికి భారీ డైలాగులు, ఫైటింగులు, సుమోలు పైకి లేవడాలు, కచ్చితంగా ఆరు పాటలు దాంట్లో ఒక ఐటమ్ సాంగ్, లాస్ట్ లో హీరో నరుక్కుంటూ రావడం లాంటి మాస్ సినిమాలు అక్కర్లేదు. కుటుంబ సమేతంగా హాయిగా ఆహ్లాదంగా ఉండే సినిమాలను జనం మెచ్చుతున్నారు. రొటీన్కు భిన్నంగా కచ్చితంగా ఉండాలి. మిడిల్ క్లాస్ మెలోడీ సినిమా అలాంటిదే. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ ప్రధాన పాత్ర. తెనాలి సమీపంలో కొలకలూరు గ్రామంలో ఒక టిఫిన్ షాపు యజమాని కొడుకుగా, బొంబాయి చెట్ని స్పెషలిస్ట్గా, కచ్చితంగా గుంటూరులో ఎప్పటికైనా ఒక మంచి హోటల్ పెట్టి తన బొంబాయి చట్నీ ప్రతాపాన్ని గుంటూరు ప్రజలకు రుచి చూపాలని కుర్రాడుగా ఆనంద్ దేవరకొండ ఎంతో హుందాగా నటించాడు. హీరోయిన్ సంధ్య పాత్రను, ఫ్రెండ్ పాత్ర ను, హీరో తల్లిదండ్రులే కాదు, మామ అత్తయ్య ల పాత్రలను మన ఇంటి వారీగా చూపించారు. పాలు పొసే ముసలాయన పాత్రను సైతం ఎంతో జాగ్రత్తగా డిజైన్ చేసిన దర్శకుడు వినోద్ ప్రతిభ అమోఘం. గుంటూరు వాసులకు ఒక మంచి పాటను బహుమానంగా అందించిన ఘనత దక్కుతుంది. అంతే కాదు ప్రతి పాత్ర గుంటూరు స్లాంగ్ ను అద్భుతంగా మాట్లాడటమే కాదు, అక్కడి మనుషులు ప్రవర్తన ను అచ్చు గుద్దినట్లు రూపొందించిన దర్శకుడి టేస్ట్ ఆ నగరం మీద ఉన్న మమకారాన్ని తెలియచెబుతుంది. ఇప్పటి వరకు ఎన్నో స్లాంగ్ లు సినిమాల్లో వచ్చిన గుంటూరు స్లాంగ్ పూర్తిగా వాడిన సినిమా ఇదే. సినిమాలో ముఖ్యంగా పాటలు, బ్యాక్ రౌండ్ మ్యూజిక్ తో పాటు సినిమా ఆటోగ్రాఫీ అద్భుతం. పూర్తిగా కొత్త నటులతో చేసిన ఈ సినిమా చూస్తున్నంతసేపు ఒక కొత్త అనుభూతి చెందడం ఖాయం. అయితే మాస్ మసాల కోరుకునే ప్రేక్షకులకు మాత్రం ఈ సినిమా తీవ్రమైన నిరుత్సాహాన్ని కలిగిస్తుంది. అమెజాన్ ప్రైమ్ లో ఇది ప్రస్తుతం అందుబాటులో ఉంది.

ప్లస్ లు : సినిమాటోగ్రఫీ, సంగీతం, సున్నితమైన కథ
మైనస్లు : కొన్ని కొన్ని చోట్ల అనవసర సీన్లు

చివరిగా : సినిమా టైటిల్ కి తగ్గట్లే మంచి మెలోడీ పాట విన్నట్లుగా ఉంటుంది సినిమా.
5/4

author avatar
Special Bureau

Related posts

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Krishna Mukunda Murari April 23 2024 Episode 450: ఆదర్శ్ కి అడ్డంగా దొరికిపోయిన ముకుంద. క్రిష్ణ మురారి బాధ. రేపటికి సూపర్ ట్విస్ట్

bharani jella

Trinayani April 23 2024 Episode 1220: అమ్మవారి పూజ చేసిన నైని గాయత్రీ దేవి జాడ తెలుసుకుంటుందా లేదా..

siddhu

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

Jagadhatri April 23 2024 Episode 212: అఖిలాండేశ్వరి కాళ్లు పట్టుకున్న కేదార్, నువ్వు  ఓడిపోవు కౌశికి అంటున్న అఖిలాండేశ్వరి..

siddhu

Brahmamudi April 23 2024 Episode 391: రాజ్ కొడుకు పై మీడియా ఆరా.. రాజ్ కి అర్హత లేదన్న అనామిక.. మీడియా ముందు ఇంటిగుట్టు..?

bharani jella

Naga Panchami: పంచమి కోసం వెతుకుతున్నా మోక్షకు పంచమి దొరుకుతుందా లేదా

siddhu

Nuvvu Nenu Prema April 23 2024 Episode 605: తల్లికి నిజం చెప్పని పద్మావతి..అరవింద ని కిడ్నాప్ చేసి విక్కీని బెదిరించిన కృష్ణ..

bharani jella

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?

Aa Okkati Adakku: అల్లరి నరేష్ “ఆ ఒక్కటి అడక్కు” ట్రైలర్ రిలీజ్..!!

sekhar

Coolie: లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో “కూలీ”గా సూపర్ స్టార్ రజినీకాంత్.. టీజర్ అదుర్స్..!!

sekhar