Entertainment News సినిమా

హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్న మంత్రి రోజా కూతురు..??

Share

వైసీపీ మంత్రి రోజా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సీఎం వైఎస్ జగన్ ని లేదా వైసీపీ పార్టీని ఎవరేమైనా అంటే తనదైన శైలిలో కౌంటర్ లు ఇస్తూ ప్రతిపక్షాలకు చుక్కలు చూపిస్తూ ఉంటుంది. పొలిటికల్ ఫీల్డ్ లో ఫైర్ బ్రాండ్ ఇమేజ్ రోజా సొంతం చేసుకోవడం జరిగింది. హీరోయిన్ గా అప్పట్లో చిరంజీవి తరం హీరోలతో చాలా సినిమాలు చేయటం తెలిసిందే. తెలుగులో మాత్రమే కాదు సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో అనేక భాషలలో నటించడం జరిగింది.

Minister Roja's daughter who is going to enter as a heroine..

హీరోయిన్ గా మాత్రమే కాదు .. క్యారెక్టర్ సపోర్ట్ ఆర్టిస్ట్ రోల్ లో కూడా రోజా పలు సినిమాలు చేయడం జరిగింది. ఆ ఇమేజ్ తో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయి పొలిటికల్ కెరియర్ స్టార్ట్ చేసిన రోజా..తర్వాత వైసీపీ లో జాయిన్ అయి వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రస్తుతం మంత్రిగా రాణిస్తున్నారు. రాజకీయ రంగంలో ఉంటూనే మరోపక్క జబర్దస్త్ వంటి కామెడీ షోలలో రాణించిన రోజా మంత్రి అయ్యాక.. పూర్తి సమయాన్ని రాజకీయాలకు కేటాయించడం జరిగింది.

Minister Roja's daughter who is going to enter as a heroine..

ఇటువంటి తరుణంలో తన వారసురాలిగా కూతురుని సినిమా రంగంలో రోజా తీసుకొస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కూతురు అన్షుమాలికనీ ఓ సినీ వారసుడు నటించనున్న మూవీలో హీరోయిన్ గా అరంగేట్రం చేయించడానికి రోజా ప్లాన్ చేస్తున్నట్లు టాక్. అన్షుమాలిక US ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో ట్రైనింగ్ ఇప్పిస్తోంది. త్వరలో అన్షుమాలిక అక్కడ జాయిన్ కానుంది. ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ అవుతుంది. రోజా తరం హీరోయిన్ లలో రాధ, శ్రీ దేవీ కూతుర్లు హీరోయిన్ లుగా ఎంట్రీ ఇవ్వడం జరిగింది. వీళ్లలో శ్రీ దేవీ కూతురు జాహ్నవి కపూర్ మాత్రమే సక్సెస్ ఫుల్ గా రానిస్తోంది.

 

 


Share

Related posts

ఆచార్య లో చిరు, చరణ్ కలిసే ఎపిసోడ్ ఏదో తెలుసా ..?

GRK

స్టేజ్ పైన అందరూ ఉండగానే నితిన్ పై అమ్మ రాజశేఖర్ సీరియస్ కామెంట్స్..!!

sekhar

రామ్ ఎంత ప‌ని చేశాడు.. హిట్ మూవీని వ‌దిలేసి ఫ్లాప్‌ను ప‌ట్టుకున్నాడు!

kavya N