Mission Impossible:
ఝుమ్మంది నాదం సినిమా తో తెలుగు తెరకు పరిచయమైంది తాప్సీ పన్ను.. ఆ తర్వాత తెలుగులో అలా అలా కనిపించి మాయమైనప్పటికీ.. ఆమె చేసిన ప్రతి సినిమా ప్రేక్షకుల మదిలో గుర్తుండి పోయింది.. అటువంటి విభిన్న కథాంశంతో తెరకెక్కుతున్న “మిషన్ ఇంపాజిబుల్” చిత్రంలో ప్రధాన పాత్ర పోషించనుంది.. ఏడు సంవత్సరాల తరువాత మళ్లీ తెలుగు సినిమాలో నటిస్తున్న తాప్సీ కి మిషన్ ఇంపాజిబుల్ టీమ్ గ్రాండ్ వెల్ కమ్ చెప్పారు..!!
ఈ చిత్రంలో ఆమె లేకపోతే “మిషన్ ఇంపాజిబుల్” అంటూ ఓ ట్యాగ్‌లైన్ జోడిస్తూ తాప్సీ పన్ను పోస్టర్ ని రిలీజ్ చేశారు మేకర్స్.. తాజాగా విడుదలైన తాప్సీ పోస్టర్ విశేషంగా ఆకట్టుకుంది ఇప్పటికీ ఈ సినిమా నుంచి విడుదలైన థీమ్ పోస్టర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.. ఈ చిత్రానికి టాలెంటెడ్ డైరెక్ట్ స్వరూప్ ఆర్ ఎస్ జె దర్శకత్వం వహిస్తున్నారు.. మ్యాట్ని ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు దీపక్ యరగర సినిమాటోగ్రాఫర్ గా, రవితేజ గిరిజాల ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి మార్ట్ కె రాబిన్ సంగీతం అందిస్తున్నారు.