Mohan babu: ‘నీ వల్ల కాకపోతే నేను ఉన్నా!’ చిరంజీవికి ఝలక్ ఇస్తూ రంగంలోకి దిగిన మోహన్ బాబు!

Share

Mohan babu: తాజాగా ఓ వేడుకలో పాల్గొన్న మన టాలీవుడ్ మెగాస్టార్ అయినటువంటి చిరంజీవిని ఓ విలేఖరి ఈ ప్రశ్న వేసాడు. ఇండస్ట్రీ పెద్ద అంటూ ఏదో అడగబోతుండగా మెగాస్టార్ వెంటనే కల్పించుకొని “నేను ఇండస్ట్రీ పెద్దని కాదు. నాకు ఆ పదవిపైన వ్యామోహం లేదు. నేను ఎప్పటికీ తెలుగు సినీ కళామతల్లి బిడ్డనే. కానీ సినీ కార్మికులకు ఏవైనా కష్టాలొస్తే నేను ఎప్పుడూ ముందుంటాను.” అని ఆ వేదికగా అన్నారు. దీంతో తాజాగా మోహన్ బాబు ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.

TOP 5 phones: కొత్త సంవత్సరంలో స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా? TOP 5 ఫోన్లు మీకోసం!

మోహన్ బాబు తీసుకున్న ఈ నిర్ణయం మెగాస్టార్ కి వ్యతిరేకమా?

ఇకపోతే తాజగా సినిమా టిక్కెట్ల అంశం పైన సినిమా పరిశ్రమ సమస్యలను ఏపీ సీఎం జగన్ కి లేఖ రాసేందుకు మోహన్ బాబు సిద్దమయ్యారు. ఇపుడు ఈ అంశమే పలుమందికి చాలా అనుమానాలను రేకెత్తిస్తోంది. మోహన్ బాబు ఇండైరెక్టుగా సినిమా పెద్దరికం తీసుకోవటానికి సిద్దంగా వున్నాడా? అనే అనుమానం ఇపుడు టాలీవుడ్లో వినిపిస్తోంది. సదరు లేఖకు ఏపీ ప్రభుత్వం నుంచి స్పందన లేకుంటే..తాను నేరుగా వెళ్లి సీఎం జగన్ తో మాట్లాడటానికి సిద్దంగా వున్నట్టుగా తెలుస్తోంది.

TDP: అసలే కష్టాల్లో ఉన్న చంద్రబాబుకు కొత్తగా మరో మూడు తలనొప్పులు..!?
మంచు వారసులు కూడా జగన్ ని కలవబోతున్నారా?

ఇండస్ట్రీ వర్గాలు అవుననే అంటున్నాయి. “మా” ఎన్నికల్లో గెలిచిన విష్ణుని తీసుకొని మోహన్ బాబు త్వరలోనే ఏపీ ముఖ్యమంత్రి ని కలుస్తాడని తెలుస్తోంది. ఇక గతంలో సినిమా టిక్కెట్ల విషయంలో రేట్లు పెంచిన తెలంగాణ గవర్నమెంట్ ని మోహన్ బాబు మెచ్చుకున్న విషయం తెలిసినదే. మెగాస్టార్ స్పందన తరువాత మోహన్ బాబు వేసిన స్కెచ్ అని టాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అసలు విషయం మనకు తెలియదు గాని, ఇదే గాని నిజమైతే మంచు ఫ్యామిలీకి, మెగాస్టార్ ఫ్యామిలీకి దూరం మరింత పెరుగుతుంది అనడంలో అతిశయోక్తికాదు.


Share

Related posts

వెనక్కి తగ్గిన మహానాయకుడు…

Siva Prasad

ఫ్లాష్ బ్యాక్ : అమితాబ్ బచ్చన్ ని చితక్కొట్టిన స్కూల్ టీచర్ – ఆ రోజు ఏమైందంటే

Naina

`మెగాఫ్యామిలీ` అంటూ వ‌ర్మ హంగామా

Siva Prasad