దాదాపు నాలుగు దశాబ్దాల సినిమా కెరీర్ మోహన్‌లాల్ సొంతం. హీరోగా ఆయన చేయని పాత్ర లేదు. మలయాళంతో పాటు అడపాదడపా తెలుగు, తమిళ్, హిందీ సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు. తాజాగా ఆయన `బారోజ్` అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తన్నారు. దర్శకుడిగా ఇదే ఆయనకు తొలి సినిమా. త్రీడీ చిత్రమిది. పోర్చుగీస్ నేపథ్యంలో సాగుతుంది. వాస్కోడాగామా ట్రెజర్కు సంబంధించిన కథ ఇది. ఈ విషయాన్ని ఆయన తన బ్లాగ్‌లో పెట్టారు. “కెమెరా ముందు ఎన్నెన్నో పాత్రలకు ప్రాణం పోసిన నేను కెమెరా వెనక తొలిసారి సత్తా చూపించడానికి అడుగులు వేస్తున్నాను. నాలుగు దశాబ్దాలకు పైబడిన నా సినిమా కెరీర్లో ఇదో కొత్త అధ్యాయం. గొప్ప అవకాశం“ అని ఆయన తన బ్లాగ్‌లో రాసుకున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులకు మెప్పించే సినిమా అవుతుందని ఆయన తెలిపారు. ఇటీవల మోహన్‌లాల్ పీరియాడిక్ డ్రామా `మరక్కర్` షూటింగ్ పూర్తి చేసుకున్నారు. అరబ్బిక్ కడలింటె సింహం అనేది ఆ సినిమాకు ట్యాగ్ లైన్. త్వరలోనే `ఇట్టిమణి మేడిన్ చైనా`లో నటించనున్నారు. ఆయన నటించిన `లూసిఫర్` ఇటీవల విడుదలై150 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇది 200 కోట్లు కనుక కలెక్ట్ చేస్తే ఆ మార్కెట్‌ను మలయాళ సినిమాకు పరిచయం చేసిన ఘనత లూసిఫర్కే చెందుతుంది.
previous post
next post