Monal akhil : గత సీజన్లకు భిన్నంగా స్టార్ మా ఛానెల్ లో ప్రసారమైన బిగ్ బాస్ సీజన్ 4 లవ్ ట్రాకుల ద్వారా ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. మొదట్లో అభిజిత్ – మోనాల్ – అఖిల్ మధ్య ట్రైయాంగిల్ లవ్ ఉన్నట్టు బిగ్ బాస్ ప్రేక్షకులకు చూపించాడు. కానీ బిగ్ బాస్ షో చివరికి వచ్చేసరికి అభిజిత్ – మోనాల్ మధ్య దూరం పెరగగా మోనాల్ మాత్రం అఖిల్ తో సన్నిహితంగా మెలిగింది.
బిగ్ బాస్ షో 14వ వారంలో మోనాల్ బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన సమయంలో అఖిల్ ఎంతో బాధ పడ్డ సంగతి తెలిసిందే. అయితే బిగ్ బాస్ షో తర్వాత కూడా అఖిల్ మోనాల్ బంధం కొనసాగుతోంది. అఖిల్ మోనాల్ తమ మధ్య ఏం లేదని అభిమానులకు చెబుతున్నా ప్రేక్షకులు మాత్రం అఖిల్ మోనాల్ ప్రేమలో ఉన్నారని భావిస్తున్నారు. అయితే మోనాల్ మాత్రం ఇంటర్వ్యూల్లో అఖిల్ తనకు మంచి ఫ్రెండ్ అనే చెబుతున్నారు.
monal akhil: మోనాల్ పై అఖిల్ ప్రేమను బయటపెట్టిన గంగవ్వ
అయితే నిన్న సాయంత్రం స్టార్ మా ఛానెల్ లో ప్రసారమైన బిగ్ బాస్ ఉత్సవంలో మోనాల్ అఖిల్ ఒకరిపై మరొకరికి ఉన్న ఇష్టాన్ని చాటుకున్నారు. మోనాల్ గంగవ్వకు చీరను బహుమతిగా ఇవ్వగా గంగవ్వ మంచి కలర్ చీరను మోనాల్ ఇచ్చిందని చెబుతుంది. బిగ్ బాస్ ఉత్సవానికి యాంకర్ గా ఉన్న శ్రీముఖి ఇదెప్పుడు వేసుకుంటావ్..? మోనాల్ పెళ్లికి వేసుకుంటావ్..? అనగా గంగవ్వ మా అఖిల్ కొనడా ఇంకా మంచి మంచి చీరలు అంటుంది.
గంగవ్వ చెప్పిన మాటతో మోనాల్ ఒక్కసారిగా అవాక్కవుతుంది. ఆ తరువాత అఖిల్ శశి మూవీలోని ఒకే ఒక లోకం నువ్వే పాటను మోనాల్ కోసం పాడతాడు. ఆ తరువాత మోనాల్ కాళ్లకు అఖిల్ పట్టీలు తొడిగి ఒకరినొకరు కౌగిలించుకుంటారు. బిగ్ బాస్ ఉత్సవాన్ని చూసిన నెటిజన్లు మోనాల్ అఖిల్ మధ్య రొమాన్స్ మామూలుగా లేదుగా అని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!