Monal Gajjar : బుల్లితెరపై ప్రసారమైన అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ ఫోర్ అని చెప్పవచ్చు. గత మూడు సీజన్ లతో పోలిస్తే బిగ్ బాస్ సీజన్ ఫోర్ ఎంతగానో ప్రేక్షకులను అలరించింది. సీజన్ ఫోర్ లో పాల్గొన్న కంటెస్టెంట్ లో ఒకరిని మించి ఒకరు గేమ్ ఆడుతూ అందరిలో ఆసక్తిని రేకెత్తించారు. అయితే బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ లలో మోనాల్, అఖిల్ క్యూట్ లవర్స్ గా పేరు సంపాదించారు. వీరిద్దరి మధ్య ఉన్న చనువును చూస్తే ప్రేక్షకులు వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోంది అంటూ పుకార్లు పెట్టారు. దీనికితోడు బిగ్ బాస్ వారు చేసే రొమాంటిక్ సీన్ చూపించడంతో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని ప్రేక్షకులు ఫిక్స్ అయిపోయారు.
బిగ్ బాస్ సీజన్ ఫోర్ అయిపోయిన తర్వాత కూడా వీరిద్దరు ప్రేమ పక్షులుగా తిరుగుతున్నారు. అంతేకాకుండా పలు బుల్లితెర కార్యక్రమాలలో పాల్గొంటూ మోనాల్ సందడి చేస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ తర్వాత మంచి పేరును సంపాదించుకున్న మోనాల్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటారు. అంతేకాకుండా ఈ సీజన్ అయిపోయిన తర్వాత పలు ఇంటర్వ్యూలలో పాల్గొన్న మోనాల్ ను తప్పకుండా అఖిల్ గురించి ప్రశ్నలు వేసేవారు.
ఈ నేపథ్యంలోనే తాజాగా తన అభిమానులతో చాట్ చేస్తున్న మోనాల్ లో ఓ అభిమాని ఏకంగా వదిన… అఖిల్ అన్నతో పెళ్లెప్పుడు? అంటూ.. ప్రశ్నించాడు దీనికి మోనాల్ స్పందిస్తూ ఎంతో చాకచక్యంగా సమాధానం చెప్పారు. తన పెళ్లి ఎప్పుడు అనే విషయం గురించి తెలియజేసేది తన తల్లి అని మోనాల్ అభిమానికి సమాధానం ఇచ్చారు. అయితే తన తల్లి వీరి పెళ్లికి ఓకే అంటే ఎలాంటి అభ్యంతరం లేదని అఖిల్ తో తన పెళ్లి జరుగుతుందని భావించిన నెటిజన్లు ఈ విషయాన్ని వైరల్ చేస్తున్నారు. అయితే మోనాల్, అఖిల్ పై ఉన్న ఇష్టాన్ని మరోసారి ఈ విధంగా అభిమానులతో పంచుకున్నారు. ఈ విషయం గురించి అఖిల్ అభిమానులకు, అఖిల్ కు తెలిస్తే ఎంతో సంబర పడతారని నెటిజన్లు భావిస్తున్నారు.