Kushi: రౌడీ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ సమంత “ఖుషి”తో భారీ బ్లాక్ బస్టర్ విజయం తమ ఖాతాలో వేసుకోవడం తెలిసిందే. సెప్టెంబర్ మొదటి తారీకు విడుదలైన ఈ సినిమా రికార్డ్ స్థాయి ఓపెనింగ్స్ రాబట్టింది. మొదటి మూడు రోజుల్లోనే 50 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేయడంతో.. పరాజయాలలో ఉన్న సమంత విజయ్ హమ్మయ్య సూపర్ హిట్ కొట్టేసాం అనే భావనలోకి వెళ్లిపోయారు. అయితే ఇంతలోనే సోమవారం కలెక్షన్స్ విషయానికొచ్చేసరికి లెక్కలు పూర్తిగా తారుమారయ్యాయి. ఓపెనింగ్స్ విపరీతంగా రాబట్టిన ఈ సినిమా సోమవారం రోజు అసలైన పరీక్ష ఎదుర్కొంది. సినిమా టాక్ కొద్దిగా అటు .. ఇటుగా విజయం సాధించిన గాని.. ఎక్కడో ఏదో మిస్సయింది అని చాలామంది సోషల్ మీడియాలో కామెంట్ చేయడం జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాలలో విదేశాలలో మొదటి మూడు రోజులు రికార్డు స్థాయిలో కలెక్షన్స్ సాధించగా నాలుగో రోజు సోమవారం కావటంతో ఒక్కసారిగా నంబర్లు తగ్గిపోవడం సినిమా యూనిట్ కి షాక్ ఇచ్చినట్లు అయింది.
సోమవారం నాలుగవ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమాకు కేవలం కోటి రూపాయల షేర్ మాత్రమే దక్కింది. అంతేకాదు ఇంకా బాక్స్ ఆఫీస్ వద్ద 18 కోట్లకు పైగా షేర్ కలెక్షన్స్ రావాల్సి ఉందట. కానీ సినిమాకి కలెక్షన్స్ రోజురోజుకి తగ్గిపోవటంతో… మేకర్స్ కొద్దిగ టెన్షన్ పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఇదే సమయంలో ఈ వారంలో రెండు కొత్త సినిమాలు విడుదల కాబోతున్నాయి. షారుక్ ఖాన్ “జవాన్”, నవీన్ పోలిశెట్టి ఇంకా అనుష్క నటించిన “మిస్ శెట్టి మిస్టర్ పోలి శెట్టి”. ఈ రెండు సినిమాలు ఏ మాత్రం పాజిటివ్ టాక్ సంపాదించుకుంటే కచ్చితంగా “ఖుషి” సినిమా కలెక్షన్స్ కి గండి పడినట్లే అని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
ఏది ఏమైనా “ఖుషి” హిట్ టాక్ సొంతం చేసుకున్న… ఇంకా బాక్స్ ఆఫీస్ వద్ద 18 కోట్లకు పైగా షేర్ కలెక్షన్స్ రావాల్సి ఉందంట. ఇటువంటి క్రమంలో సూపర్ హిట్ కొట్టాం అని అనుకున్నా సమంత మరియు విజయ్ దేవరకొండలకి సోమవారం నాడు “ఖుషి” కలెక్షన్స్ ఊహించని రీతిలో తగ్గిపోవటంతో వాళ్ల నోటి మాట రావటం లేదట. తాజా పరిణామాలతో నైజాం అలాగే ఓవర్సీస్ లో ఈ సినిమా పెద్దగా నష్టాలను తప్పించుకున్న కానీ సీడెడ్ ఆంద్ర లో మాత్రం కాస్త ఎక్కువ స్థాయిలోనే నష్టాలు కలిగించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. దీంతో ఇప్పుడు మేకర్స్ సక్సెస్ మీట్ లు ఎక్కువగా నిర్వహించాలని.. కలెక్షన్స్ వచ్చేలా చూడాలని భావిస్తున్నారట.