“RRR” విజయంతో ఎన్టీఆర్ పేరు దేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా మారుమొగుతుంది. కొమరం భీం పాత్రలో తారక్ నటనకు చాలామంది ఫిదా అయ్యారు. ఈ సినిమాతో గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు. ఫస్ట్ టైం “RRR”తో ఇండస్ట్రీ హిట్ అందుకున్న తారక్ ప్రస్తుతం కొరటాల శివతో తన నెక్స్ట్ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ఎప్పుడో స్టార్ట్ కావలసి ఉంది. గత మే నెల నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కావలసి ఉండగా ఇప్పటివరకు మొదలు కాలేదు. దీంతో ఎన్టీఆర్ అభిమానులు తెగ టెన్షన్ పడుతున్నారు.
ఇదిలా ఉంటే రాజమౌళితో సినిమా చేసిన తర్వాత ఎన్టీఆర్ వీరపరంగా అనేక ఇబ్బందులు గతంలో ఎదుర్కొన్నారు. రాజమౌళి స్థాయిలో మిగతా దర్శకులు గతంలో చూపించలేని పరిస్థితి ఉండటంతో.. రాజమౌళితో చేసిన సినిమా తర్వాత ఎన్టీఆర్ నటించిన చాలా సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. దీంతో ఇప్పుడు “RRR” తరువాత అటువంటి పరిస్థితి రాకూడదని కొరటాల శివ సినిమా స్క్రిప్ట్ విషయంలో తారక్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. పైగా కొరటాల తెరకెక్కించిన “ఆచార్య” అట్టర్ ఫ్లాప్ అవడంతో.. లేట్ అయిన పర్వాలేదు కానీ పకడ్బందీ స్క్రిప్ట్ తో ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలని ఎన్టీఆర్ డిసైడ్ అయ్యారట.
దీంతో ఈ సినిమా షూటింగ్ నవంబర్ నెలలో స్టార్ట్ అవుతుంది అని అంటున్నారు. క్రమంలో వచ్చిన రెండు నెలల గ్యాప్ లో తారక్ బరువు తగ్గే పనిలో ఉన్నట్లు సమాచారం. “NTR 30” వర్కింగ్ టైటిల్ కలిగిన ఈ సినిమాలో ఎన్టీఆర్ ని చాలా పవర్ ఫుల్ గా కొరటాల చూపించనున్నారు అంట. గతంలోనే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన “జనతా గ్యారేజ్” సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో “ఎన్టీఆర్ 30” ప్రాజెక్టుపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.