మ‌రో మెగా హీరోతో ….


కొన్ని నిర్మాణ సంస్థ‌ల‌కు, కొంద‌రు ద‌ర్శ‌కుల‌కు, నిర్మాత‌ల‌కు కొంద‌రి హీరోల‌తో మంచి అనుబంధం ఏర్ప‌డుతుంది. వారితోనే ఎక్కువ సినిమాలు చేస్తుంటారు. ఇప్పుడు మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ‌కు మెగా ఫ్యామిలీతో మంచి అనుబంధం ఉంది. రామ్‌చ‌ర‌ణ్‌తో `రంగ‌స్థ‌లం` స‌క్సెస్ త‌ర్వాత మెగా ఫ్యామిలీకి చెందిన సాయిధ‌ర‌మ్ తేజ్ హీరోగా కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో` `చిత్ర‌ల‌హ‌రి` సినిమా చేస్తున్నారు. అలాగే సాయిధ‌ర‌మ్ తేజ్ సోద‌రుడు వైష్ణ‌వ్ తేజ్ డెబ్యూ మూవీ నిర్మాణంలో సుకుమార్ రైటింగ్స్‌తో భాగ‌స్వామిగా మారుతున్నారు. ఈ ఇద్ద‌రు మెగా హీరోలే కాకుండా మ‌రో మెగా హీరో వ‌రుణ్ తేజ్‌తో కూడా ఈ నిర్మాణ సంస్థ సినిమా చేయ‌నుంద‌ని స‌మాచారం. ఓ డెబ్యూ డైరెక్ట‌ర్ చెప్పిన క‌థ న‌చ్చ‌డంతో వ‌రుణ్ తేజ్‌కు ఆ క‌థ‌ను వినిపించార‌ట‌. వ‌రుణ్‌కు కూడా న‌చ్చ‌డంతో త‌ను సినిమా చేయ‌డానికి ఓకే అన్నాడ‌ట‌. అయితే ఇప్పుడు వ‌రుణ్‌తేజ్ బాక్స‌ర్‌గా సినిమా చేయ‌బోతున్నాడు. అలాగే హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో త‌మిళ చిత్రం `జిగ‌ర్ తండా` తెలుగు రీమేక్ `వాల్మీకి`లో న‌టిస్తున్నాడు. ఈ రెండు సినిమాల్లో ఏ ఒక‌టి పూర్త‌యినా.. త‌దుప‌రి మైత్రీ సంస్థ‌లో వ‌రుణ్ తేజ్ సినిమా ఉంటుంద‌ట‌.