కెరీర్ స్టార్టింగ్ నుంచి మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న అఖిల్ అక్కినేని హీరోగా నటిస్తున్న మూడో చితం ‘Mr. మజ్ను’. ఇప్పటి వరకూ రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ తో మెప్పించిన ఈ చిత్ర యూనిట్, రీసెంట్ గా మజ్ను జ్యూక్ బాక్స్ విడుదల చేశారు. బ్యాక్ టు బ్యాక్ హిట్ ఆల్బమ్స్ ఇస్తున్న థమన్ ఈ చిత్రానికి ఇచ్చిన మ్యూజిక్ కూడా సంగీత ప్రియులను ఆకట్టుకుంటోంది. అందరికీ నచ్చే ఆల్బమ్ ఇచ్చిన థమన్ ని అక్కినేని అభిమానుల నుంచి కాంప్లిమెంట్స్ వస్తున్నాయి.
ఇదిలా ఉంటే మరో తొమ్మిది రోజుల్లో విడుదల కాబోతున్న ‘Mr. మజ్ను’ నుంచి లేటెస్ట్ గా ‘చిరు చిరు నవ్వుల’ సాంగ్ వీడియో ప్రోమో ను విడుదల చేశారు. పెళ్లి సందడిలో అఖిల్ ట్రెడిషనల్ వేర్ లో డ్యాన్స్ చేస్తూ కనిపించాడు. అచ్చతెలుగు అబ్బాయిలా కనిపించిన అఖిల్ లో చాలా ఎనర్జీ కనిపించాడు. ఈ ప్రోమో సాంగ్ లో అఖిల్ తో పాటు రావు రమేష్.. రాధా రవి లాంటి చాలామంది క్యారెక్టర్ ఆర్టిస్టులు కలిసిమెలిసి హంగామా చేశారు. ఈ పాటను కలర్ఫుల్ గా.. రిచ్ గా ఉండే ఒక పెళ్ళి మండపంలో చిత్రీకరించడంతో ఒక్కసారి చూడగానే ఆకట్టుకునేలా ఉంది. కొన్ని షాట్స్ లో పెద్ద షాండ్లియర్లు.. మన చూపును పక్కకు తిప్పుకోనివ్వకుండా చేస్తాయి. ఈ పాటలో అఖిల్ డ్యాన్స్ కూడా చాలా బాగుంది.
తొలిప్రేమ సినిమాతో మొదటి చిత్రాన్నే సూపర్ హిట్ గా మలిచిన వెంకీ అట్లూరి మంచి హిట్ అందుకున్నాడు. పెర్ఫెక్ట్ లవ్ స్టోరీ సినిమాని ఇచ్చిన వెంకీ, మిస్టర్ మజ్నుని కూడా అదే రేంజులో తెరకెక్కిస్తున్నట్లున్నాడు. మరి హిట్ కోసం ఎదురు చూస్తున్న అక్కినేని అఖిల్ కి వెంకీ అట్లూరి సాలిడ్ హిట్ ఇస్తాడేమో చూడాలి.