NewsOrbit
Entertainment News సినిమా

Allu Arjun: అల్లు అర్జున్ కి జోడిగా “సీతారామమ్” హీరోయిన్..!!

Share

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా “అర్జున్ రెడ్డి” డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో కొత్త సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. రెండు నెలల క్రితం ఈ సినిమాకి అధికారిక ప్రకటన రావడం జరిగింది. బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ ఈ ప్రాజెక్టు నిర్మిస్తోంది. అయితే ఈ సినిమాలో అల్లు అర్జున్ కి జోడిగా సీతారామం ఫెమ్ మృణాల్ ఠాకూర్ నీ తీసుకోవటానికి రెడీ కావడం జరిగిందంట. ఇప్పటికే స్టోరీకి సంబంధించి డైరెక్టర్ సందీప్ ఆమెతో కొన్ని సెట్టింగ్స్ వేసినట్లు ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో బన్నీతో మృణాల్ నటించబోతున్నట్లు త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతున్నట్లు సమాచారం.

mrunal thakur haroine in sandeep reddy vanga and allu arjun movie

ప్రస్తుతం అల్లు అర్జున్ “పుష్ప ది రూల్” పుష్ప రెండో భాగం సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఇటీవలే ఫన్నీ పుట్టినరోజు నాడు పుష్ప సెకండ్ పార్ట్ స్పెషల్ వీడియో సినిమాపై హైప్ పెంచేసింది. ముఖ్యంగా అమ్మవారి గెటప్ లో బన్నీ లుక్ ఎంతగానో ఆకట్టుకోవడం జరిగింది. సోషల్ మీడియాలోనే బన్నీ అమ్మవారి పోస్టర్… అనేక రికార్డులు క్రియేట్ చేయడం జరిగింది. యూట్యూబ్ లో స్పెషల్ వీడియో 67 మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతుంది. అత్యధికంగా హిందీలోనే ఎక్కువ వ్యూస్ రావడం విశేషం.

mrunal thakur haroine in sandeep reddy vanga and allu arjun movie

సో దీన్ని బట్టి చెప్పవచ్చు నార్త్ లో పుష్ప సెకండ్ పార్ట్… కోసం జనాలు ఎంతలా ఎదురుచూస్తున్నారో. ఈ సినిమా తర్వాత సందీప్ రెడ్డి వంగ ప్రాజెక్టు బన్నీ మొదలుపెట్టనున్నట్లు సమాచారం. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగ యానిమల్ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాను రణబీర్ కపూర్ హీరో. యానిమల్ ప్రాజెక్టు కంప్లీట్ అయిన వెంటనే బన్నీ ప్రాజెక్ట్ పట్టాలెక్కించడానికి దర్శకుడు సందీప్ రెడ్డి వంగ రెడీ అయినట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. అర్జున్ రెడ్డి సినిమా హిట్ తర్వాత తెలుగులో సందీప్ మరో సినిమా చేయలేదు. ఈ క్రమంలో అల్లు అర్జున్ ప్రాజెక్ట్ కి ముందు ప్రభాస్ తో స్పిరిట్ అనే సినిమా ప్రాజెక్టు ప్రకటించడం జరిగింది. ఈ క్రమంలో ముందు ప్రభాస్ సినిమా స్టార్ట్ అవుతుందా లేదా బన్నీ సినిమా స్టార్ట్ అవుతుందో చూడాలి.


Share

Related posts

Ileana: హద్దులు మీరి మరీ ఇలియానా ఎక్స్‌పోజింగ్ చేయడానికి అదే కారణమట!

Ram

Agent: చాలా పెద్ద తప్పు చేశామంటూ “ఏజెంట్” నిర్మాత సంచలన పోస్ట్..!!

sekhar

Nag ashwin : నాగ్ అశ్విన్ ప్రభాస్ తో చేసేది పాన్ వరల్డ్ మూవీ

GRK