AdiPurush: ప్రభాస్ కొత్త సినిమా “ఆదిపురుష్” టీజర్ పై ఉన్న కొద్ది నెగెటివ్ పెట్టి పెరుగుతూ ఉంది. గ్రాఫిక్స్ మరి దారుణంగా ఉండటంతో ఇప్పటికే భారీ ఎత్తున ట్రోలింగ్ జరుగుతూ ఉంది. కానీ థియేటర్ లో “ఆదిపురుష్” మంచి ఫీల్ కలిగిన సినిమా అని .. సినిమా విడుదలయ్యాక ఇటువంటి కామెంట్లు ఎవరు చేయలేరని దర్శకులు మరియు నిర్మాతలు చెప్పుకొస్తున్నారు. అక్టోబర్ మూడవ తారీకు “ఆదిపురుష్” టీజర్ రిలీజ్ అయ్యి సోషల్ మీడియాలో అనేక రికార్డులు క్రియేట్ చేయడం తెలిసిందే.
పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కిన “ఆదిపురుష్” త్రీడీ ఫార్మేట్ లో వస్తూ ఉండటంతో .. సినిమా రిజల్ట్ పై అభిమానులు టెన్షన్ పడుతున్నారు. వరుసగా సాహో, రాదేశ్యం రెండు సినిమాలు అట్టర్ ఫ్లాప్ కావడంతో ఈ సినిమా ఖచ్చితంగా విజయం సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ టీజర్ పై “మహాభారత్” లో భీష్ముడి పాత్ర పోషించిన ప్రముఖ నటుడు ముఖేష్ ఖన్నా .. సీరియస్ వ్యాఖ్యలు చేశారు. రాముడు కృష్ణుడు బాడీ బిల్డర్లు కాదని సెటైర్లు వేశారు. ఈ విషయంలో అందరూ నాతో ఏకీభవించకపోవచ్చు. హిందువుల దేవుళ్ళు బాడీబిల్డర్లు కాదు.
కానీ వారి ముఖాలు మృదువైన గొప్ప రూపాన్ని కలిగి ఉంటాయి. మనం చూసిన రామునికి గడ్డం మరియు మీసాలు లేవని మేము నమ్ముతున్నాం. హనుమాన్ ముఖచిత్రం ప్రజల మనసుల్లో ఉంది. మరి మీరు అతనిని సినిమాలో ఎలా చూపించారు. రామాయణ పాత్రల రూపాన్ని మార్చలేరు. సైఫ్ అలీ ఖాన్ పాత్రకి మొగల్ లుక్ వచ్చింది. అవతార్ల తీయాలనుకుంటున్నారు మీరు రామాయణం చేస్తున్నామని చెప్పడం మానేయండి. మా ఆచారాలు మరియు ఇతిహాసాలను మార్చడానికి మీ డబ్బును వృధా చేసుకోవద్దు అంటూ ముఖేష్ ఖన్నా “ఆదిపురుష్” పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.