Bigg Boss Ott: బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో సందడి చేస్తోన్న సంగతి తెలిసిందే. `బిగ్‌బాస్ నాన్‌స్టాప్` పేరుతో ప్రారంభమైన ఈ షోకు నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. 24/7 స్ట్రీమింగ్ అవుతున్న ఈ షోలో మొత్తం 17 మంది కంటెస్టెంట్స్ పాల్గొనగా.. మొదటి వారం ముమైత్ ఖాన్ ఇండిబాట పట్టింది.
సరయు, ముమైత్ ఖాన్, మిత్రా శర్మ, ఆర్జే చైతు అరియానా గ్లోరి, నటరాజ్ మాస్టర్ ఈ ఏడుగురు మొదటి వారం నామినేట్ అయ్యారు. అయితే మాటి మాటికి సిగరెట్ల కోసం బోరు బోరు ఏడ్వడం, పచ్చి బూతులు మాట్లాడటం, వింత వింతగా ప్రవర్తించడం ముమైత్‌కు మైనస్‌గా మారాయి. దాంతో తొలివారమే ఆమె దుకాణం సద్దేసింది.
దీంతో వారం ఉన్న ముమైత్‌కు బిగ్‌బాస్ ఎంత రెమ్యునరేషన్ ఇచ్చాడు అంటూ నెటిజన్లు ఆరాలు తీయడం మొదలు పెట్టారు. అయితే సోషల్ మీడియాలో వినిపిస్తున్న కథనాలు ప్రకారం.. ఉన్న ఒక్క వారానికి గానూ ముమైత్ రూ. 80 వేలు రెమ్యునరేషన్ తీసుకుందని అంటున్నారు.
మరి ఇందులో ఎంత వరకు నిజమో తెలియాల్సి ఉంది. కాగా, బ్యాక్‌గ్రౌండ్ డ్యాన్సర్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన ముమైత్.. అతి తక్కువ కాలంలోనే స్టార్ డ్యాన్సర్‌గా ఎదిగింది. ఆ తర్వాత తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, బెంగాలీ, ఒడియా, బెంగాలీ భాషల్లో నటించి గుర్తింపు సంపాదించుకుంది.