Pushpa 2: 2021లో డిసెంబర్ నెలలో విడుదలైన “పుష్ప” ప్రపంచ సినిమా రంగంలోనే సంచలనం సృష్టించింది. ప్రయోగాత్మకంగా సుకుమార్ మరియు బన్నీ మొట్టమొదటిసారి పాన్ ఇండియా నేపథ్యంలో తీసిన ఈ సినిమా ఊహకందని రీతిలో విజయాన్ని అందుకుంది. దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా “పుష్ప” మేనియా నడిచింది. “పుష్ప”లో బన్నీ డైలాగ్స్, డాన్స్, మేనరిజమ్స్ అందరినీ ఆకట్టుకోవడం జరిగింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎలాంటి ప్రమోషన్ కార్యక్రమాలు చేయకపోయినా ₹100 కోట్లకు పైగా అప్పట్లోనే కలెక్షన్ సాధించింది. అంతేకాదు ఇటీవల ఈ సినిమాకి గాను జాతీయ ఉత్తమ నటుడు అవార్డు కూడా అల్లు అర్జున్ కి వరించింది.
అంతేకాకుండా ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ కూడా అవార్డ్ గెలవడం జరిగింది. దీంతో ఇప్పుడు “పుష్ప 2” సినిమాని డైరెక్టర్ సుకుమార్ చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా గురించి దేవి శ్రీ ప్రసాద్ కీలక విషయాలు లీక్ చేశారు. పుష్ప సెకండ్ భాగం స్క్రీన్ ప్లే ఓ రెంజ్ లో ఉంటది. సినిమాలో జాతర నేపథ్యంలో గంగమ్మ అమ్మవారి గెటప్ లో బన్నీ సన్నివేశాలు సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని తెలిపారు. ఆల్రెడీ బన్నీ అమ్మవారి గెటప్ ఫోటోలు సినిమా యూనిట్ విడుదల చేయడం జరిగింది. అప్పట్లోనే మంచి రెస్పాన్స్ వచ్చింది.
పైగా ఇటీవల రామోజీ ఫిలిం సిటీ లో ఈ అమ్మవారి గెటప్ లో భారీ యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు కూడా అల్లు అర్జున్ “మంగళవారం” ప్రీ రిలీజ్ వేడుకలో తెలియజేయడం జరిగింది. ఈ క్రమంలో దేవి శ్రీ ప్రసాద్ అల్లు అర్జున్ అమ్మవారి గెటప్ గురించి చేసిన కామెంట్స్ బట్టి చూస్తే థియేటర్లలో బండి అభిమానులకు పూనకాలు గ్యారెంటీ అని తెలుస్తుంది. వచ్చే ఏడాది ఆగస్టు 15వ తారీకు ఈ సినిమా విడుదల కాబోతోంది. మొదటి భాగం కంటే అత్యధిక భాషలలో పుష్ప సెకండ్ పార్ట్ విడుదల చేయబోతున్నట్లు సమాచారం.