Thaman: ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో కీలక ప్రాజెక్టులు దక్కించుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ పేరు ఇండస్ట్రీలో మారుమ్రోగుతోంది. గత ఏడాది బన్నీ నటించిన “అల వైకుంఠపురం లో” సినిమా సాంగ్స్ బ్లాక్ బస్టర్ విజయాలు సాధించడం మాత్రమే కాక.. సోషల్ మీడియాలో అదరగొట్టడంతో.. పాటు రికార్డులు సృష్టించడంతో.. తమన్ కి వరుస ఆఫర్లు వస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పవన్ నటించిన “వకీల్ సాబ్” సినిమాకి మ్యూజిక్ అందించగా… మహేష్ నటిస్తున్న “సర్కారు వారి పాట” సినిమా చాన్స్ అందుకోవడం జరిగింది. అంత మాత్రమే కాక పవన్… రాణా నటిస్తున్న మల్టీస్టారర్ సినిమా కి కూడా మ్యూజిక్ అందిస్తున్నాడు.

ఇలాంటి కీలక ప్రాజెక్టులు దక్కించుకుంటున్న తమన్ ఇండస్ట్రీలో మరో టాప్ మోస్ట్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ కు అవకాశం అందుకోవడం జరిగింది. మేటర్ లోకి వెళ్తే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య బాబు నటించబోయే సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నారు. గోపీచంద్ మలినేని గతచిత్రం “క్రాక్” సినిమా కి.. అదిరిపోయే మ్యూజిక్ అందించడంతో… ఈసారి కూడ తమన్ కి ఛాన్స్ ఇచ్చినట్లు సమాచారం. “క్రాక్” సినిమా విజయం తో మంచి జోరు మీద ఉన్న గోపీచంద్ మలినేని బాలయ్య సినిమాని పూర్తి కమర్షియల్ తరహాలో తెరకెక్కించాలని డిసైడ్ అయ్యాడట, అందుకోసం ఇప్పుడు స్క్రిప్ట్ వర్క్ పనులు కూడా అదే తరహాలో ఉండేటట్టు చూసుకుంటున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినబడుతున్నాయి.
ప్రస్తుతం బాలయ్య బాబు బోయపాటి దర్శకత్వంలో “అఖండ” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమాకి సంబంధించి రిలీజ్ అయిన టీజర్ ప్రేక్షకులను ఎంతగానో అలరించడం మాత్రమేకాక సోషల్ మీడియాలో రికార్డులను క్రియేట్ చేయడం జరిగింది. వరుస ఫ్లాపుల్లో ఉన్న బాలయ్య బాబు ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజిలో పెట్టుకున్నారు. ఈ సినిమా అయిన వెంటనే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా మొదలయ్యే ఛాన్స్ ఉన్నట్లు ఫిల్మ్ నగర్ టాక్.