Entertainment News సినిమా

Anasuya: నా కోడలైన సరే నన్ను అలాగే పిలవాలి అనసూయ వైరల్ కామెంట్స్..!!

Share

Anasuya: యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బుల్లితెరపై ఇంకా వెండి ధరపై తిరుగులేని ఫాలోయింగ్ అనసూయ సొంతం. తెలుగు కామెడీ షో జబర్దస్త్ ద్వారా ఎంతో పాపులారిటీ సంపాదించిన అనసూయ అనతి కాలంలోనే సినిమా రంగంలో ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయింది. మల్టీ టాలెంటెడ్ తో రాణిస్తోంది. క్యారెక్టర్ సపోర్ట్ పాత్రలతో పాటు నెగటివ్ షేడ్స్ కలిగిన పాత్రలు కూడా చేస్తూ ఉంది. సుకుమార్ దర్శకత్వంలో “పుష్ప”లో సునీల్ భార్యగా అనసూయ చాలా మొరట క్యారెక్టర్ లో కనిపించి ప్రేక్షకులను మెప్పించింది. పాత్రలు మాత్రమే కాదు ఐటెం సాంగ్ లలో కూడా అనసూయ స్టెప్పులు వేసి గతంలో అలరించిన సందర్భాలు ఉన్నాయి.

My daughter-in-law, you should call me like that, Anasuya Viral Comments
Suma

ఇదిలా ఉంటే ఇటీవల తనని ఆంటీ అని పిలవడం పట్ల సోషల్ మీడియాలో చాలా రీతిలో అనసూయ సీరియస్ కావడం తెలిసిందే. పరిస్థితి ఇలా ఉంటే తెలుగు టాప్ యాంకర్ సుమతో కలిసి ఇటీవల క్రేజీ కిచెన్ అనే కార్యక్రమంకి సంబంధించి అనసూయ కూడా జాయిన్ అయింది. సుమ యూట్యూబ్ ఛానల్ లో ప్రసారం కాబోయే ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రోమో లేటెస్ట్ గా రిలీజ్ అయింది. ఆ ప్రోమోలో ఇంగ్లీష్ భాష గురించి ఇంకా అత్తా కోడలు గురించి సుమా అనసూయ తమదైన శైలిలో కామెడీ పండించారు.

My daughter-in-law, you should call me like that, Anasuya Viral Comments
Anasuya

ఈ సందర్భంగా అనసూయ మాట్లాడుతూ .. నా కొడుకుకి పెళ్లయి కోడలు ఇంటికి వస్తే.. నన్ను అత్త అనకూడదు. అను అని స్టైల్ గా పిలవాలి అంటూ చెప్పుకొచ్చింది. కోడలైనా సరే నన్ను.. స్టైల్ గానే పిలవాలి అని చెప్పటంతో సుమ అవతాల వ్యక్తి నిన్ను ఎలా పిలవాలో కూడా నువ్వే డిసైడ్ చేస్తావన్నమాట అంటూ అనసూయ కామెంట్లకు సెటైర్లు వేసింది. క్రేజీ కిచెన్ ఈ కార్యక్రమంలో అనసూయ కొన్ని వంటకాలు చేసినట్లు ప్రోమోలో చూపించారు. సెప్టెంబర్ 22వ తారీకు సాయంత్రం ఈ కార్యక్రమం సుమ యూట్యూబ్ ఛానల్ లో ప్రసారం కానుంది.


Share

Related posts

NTR 31: ఆ సినిమా టార్గెట్ గా ఎన్టీఆర్ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారట ప్రశాంత్ నీల్..??

sekhar

Khushi: “ఖుషి” మూవీ ని గుర్తు తెచ్చుకొని భూమిక వైరల్ కామెంట్స్..!!

sekhar

`వాల్మీకి` రిలీజ్ వాయిదా

Siva Prasad