“లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలు చాలా చురుగ్గా జరుగుతున్నాయి. ఇటీవల సినిమాకి సంబంధించి విడుదలైన ట్రైలర్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడం తెలిసిందే. వరుస ప్లాపులలో ఉన్న విజయ్ దేవరకొండ “లైగర్” కి సంబంధించి డాన్సులు మరియు ఫైట్స్ విషయంలో చాలా కష్టపడ్డాడు. సినిమాలో విజయ్ దేవరకొండ నత్తివాడిగా ఇంకా చాయ్ అమ్ముకునే వ్యక్తిగా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. మరి ముఖ్యంగా బాక్సర్ గా విజయ్ దేవరకొండ రాణిస్తున్నాడు. ఈ సినిమాలో ఇంటర్నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ తో కూడా విజయ్ నటించడం జరిగింది. ఈ క్రమంలో విజయ్ దేవరకొండ తల్లి టైసన్ తో కలిసి నటిస్తున్నట్లు తెలుసుకొని ఫస్ట్ భయపడిందంట.
ఈ క్రమంలో మైక్ టైసన్ తో షూటింగ్ కోసం విజయ్ దేవరకొండ అమెరికా వెళ్ళిన టైములో ప్రత్యేకమైన పూజలు.. చేయటం మాత్రమే కాదు విభూతి కూడా పెట్టినట్లు.. విజయ్ దేవరకొండ ఇటీవల తెలియజేశారు. ఏది ఏమైనా తన తల్లి చేసిన పూజలు ఫలించాయని ఎటువంటి అపాయాలు రాలేదని… ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ తెలియజేశారు. పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కిన “లైగర్” మైక్ టైసన్ నటించిన క్రమంలో ఇంటర్నేషనల్ గా ఈ సినిమాకి మరింత క్రేజ్ పెరిగింది.
ఆగస్టు 25వ తారీకు “లైగర్” విడుదల కానుంది. ప్రస్తుతం సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు చురుగ్గా జరుగుతున్నాయి. వరుసపరాజయాలలో ఉన్న విజయ్ దేవరకొండ “లైగర్” కోసం చాలా కష్టపడ్డాడు. బాక్సర్ పాత్ర కోసం బాడీ వర్కౌట్ చేయడం మాత్రమే కాదు.. ఏ సినిమాలో వేయని డాన్స్ “లైగర్” లో వేయడం జరిగింది. “లైగర్” లో విజయ్ తల్లి పాత్రలో రమ్యకృష్ణ నటిస్తోంది. ఫస్ట్ టైం డైరెక్టర్ పూరి జగన్నాథ్…పాన్ ఇండియా సినిమా తీయడంతో ఇండస్ట్రీ మొత్తం “లైగర్” ప్రాజెక్ట్ నీ ఆసక్తిగా గమనిస్తుంది.