Prabhas: తెలుగు చలనచిత్ర రంగంలో ప్రస్తుతం మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ టైం నడుస్తోంది. బ్యాక్ టు బ్యాక్ విజయాలు అందుకుంటున్న ఈ బ్యానర్ లేటెస్ట్ గా ఓ భారీ పాన్ ఇండియా ప్రాజెక్టుకి శ్రీకారం చుట్టడం జరిగింది. విషయంలోకి వెళ్తే బాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా సంవత్సరాల తర్వాత షారుక్ ఖాన్ కొత్త సినిమా “పఠాన్” ప్రభంజనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. వారం రోజులకు దాదాపు 700 కోట్ల రూపాయలు కలెక్షన్స్ సాధించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇంకా హౌస్ ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతుంది. ఓవరాల్ గా ₹1000 కోట్లకు పైగానే కలెక్షన్స్ సాధిస్తుందని ట్రేడ్ వర్గాల అంచనా.

ఈ క్రమంలో ఈ సినిమా దర్శకుడు సిద్ధార్థ ఆనంద్ ఇటీవల ప్రభాస్ కీ స్టోరీ వినిపించడం జరిగిందట. కథ బాగా నచ్చటంతో ప్రభాస్ కూడా ఓకే చెప్పినట్లు త్వరలో అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనుందట. ఈ క్రమంలో సంస్థ నిర్మాతలలో ఒకరైన నవీన్ ఎర్నేని.. బుధవారం దర్శకుడు సిద్ధార్ధ్ ఆనంద్ నీ కలిశారట. పఠాన్ సినిమా విజయం సాధించటంతో అభినందించారట. ఈ పరిణామంతో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ప్రభాస్ సినిమా నిజమే అనే వార్తకు ఈ భేటీ మరింత బలం చేకూర్చింది. ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలు చేస్తున్నారు. డార్లింగ్ చేతుల ఐదు ప్రాజెక్టులు ఉన్నాయి. అన్నీ కూడా పాన్ ఇండియా ప్రాజెక్టు లే. ఈ క్రమంలో ఇప్పుడు మరో పాన్ ఇండియా సినిమాకి ప్రభాస్ ఓకే చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి.

పాన్ ఇండియా సూపర్ స్టార్ గా మారిన తర్వాత ప్రభాస్ కీ ఒక్క హిట్టు పడలేదు. దీంతో ఇప్పుడు చేస్తున్న అన్ని సినిమాలలో ఏదైనా భారీ విజయం సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ క్రమంలో జనవరి నెలలో “ఆదిపురుష్” రిలీజ్ కావలసి ఉండగా గ్రాఫిక్ వర్క్ పై భయంకరమైన నెగిటివిటీ రావటంతో జూన్ నెలలో విడుదల చేస్తున్నారు. ఇక ఆ తర్వాత సెప్టెంబర్ నెలలో కేజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన “సలార్” సినిమా రిలీజ్ కానుంది. ప్రభాస్ అన్ని ప్రాజెక్టులలో కంటే “సలార్” పైనే అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఏది ఏమైనా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ప్రభాస్ భారీ పాన్ ఇండియా ప్రాజెక్టు ఓకే చేసినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.