సినిమా

Nabha Natesh: న‌భా న‌టేష్ న‌యా లుక్స్‌.. ఇలా చూస్తే ఎవ్వ‌రైనా పిచ్చెక్కిపోతారు!

Share

Nabha Natesh: ప్ర‌ముఖ హీరోయిన్ న‌భా న‌టేష్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. 2018లో వ‌చ్చిన `నన్ను దోచుకుందువటే` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ అందాల భామ‌.. డైన‌మిక్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కించిన `ఇస్మార్ట్ శంక‌ర్‌` మూవీలో రామ్ స‌ర‌స‌న న‌టించి యూత్‌లో సూప‌ర్ పాపుల‌ర్ అయింది.

ఈ సినిమాతో ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ను ఖాతాలో వేసుకున్న న‌భా.. ఆ త‌ర్వాత మాస్ మ‌హారాజ్‌కు జోడీగా `డిస్కో రాజా` సినిమాలో న‌టించే అవ‌కాశం వ‌చ్చింది. కానీ, భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డింది.

ఆపై న‌భా నుంచి సోలో బ్రతుకే సో బెటర్, అల్లుడు అదుర్స్‌, మాస్ట్రో చిత్రాలు వ‌చ్చాయి. ఇవేమి ఆమెకు స్టార్ ఇమేజ్‌ను అందించ‌లేక‌పోయాయి. ఇక అవ‌కాశాలు కూడా త‌గ్గుతుండ‌టంతో.. ఈ బ్యూటీ సోష‌ల్ మీడియా వేదిక‌గా అందాల ఆర‌బోత‌కు తెర లేపింది.

త‌ర‌చూ హాట్ హాట్ ఫొటో షూట్ల‌తో కుర్రాళ్ళ‌ను అల్లాడించేస్తోంది. తాజాగా కూడా ట్రెండీ ఔట్ ఫిట్‌లో ఎగ‌సిప‌డే న‌డుమందాలు, క‌వ్వించే న‌డుము ఒంపుసొంపులు చూపిస్తూ కిల్లింగ్ లుక్స్‌తో ఫొటోల‌కు పోజులిచ్చింది. ఆపై అందుకు సంబంధించిన పిక్స్‌ను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేరింది.

`డార్లింగ్, నేను పగటి కలలా అనిపించే ఒక పీడకలని` అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. దీంతో ఇప్పుడీమె న‌యా లుక్స్ నెట్టింట వైర‌ల్‌గా మారాయి. వీటిని చూస్తే ఎవ్వ‌రైనా పిచ్చెక్కిపోతారు. అంత అందంగా ఆమె ఆక‌ట్టుకుంటోంది.


Share

Related posts

జనవరి 3న ‘నమస్తే నేస్తమా’

Siva Prasad

Acharya: చిరుత పులుల్లా చిరు-చ‌ర‌ణ్ స్టెప్పులు.. ప్రోమోతోనే పిచ్చెక్కించారుగా!

kavya N

శృతిహాసన్ ఛాన్స్ కొట్టేసిన తమన్నా …?

GRK
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar