Nagarjuna : అమలతో కలిసి నటించిన సినిమాలెన్నో చెప్పలేకపోయిన కింగ్..!

nag-about-his-films
Share

Nagarjuna : టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటికీ మన్మధుడుగా నాగార్జున ఎంతోమంది ప్రేక్షకాభిమానులను సంపాదించుకున్నారు. ఒకవైపు సినిమాలలో నటిస్తూ మరోవైపు బుల్లితెర పై బిగ్ బాస్ వంటి రియాలిటీ షోలకు హోస్ట్ గా బాధ్యతలు నిర్వహిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. తాజాగా నాగార్జున నటించిన “వైల్డ్ డాగ్”సినిమా ఈ నెల 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే నాగార్జున ఈ సినిమా ప్రమోషన్ లను భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆహా యాప్ ద్వారా రానా వ్యాఖ్యాతగా నిర్వహిస్తున్న  ‘No. 1 యారి’ కార్యక్రమానికి నాగార్జున, వైల్డ్ డాగ్ నాయిక సయామీ ఖేర్‌తో కలిసి ఈ కార్యక్రమంలో సందడి చేశారు.

nag-about-his-films
nag-about-his-films

‘No. 1 యారి’ కార్యక్రమం ద్వారా రానా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం తెలియక నాగార్జున హావభావాలను వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే నాగార్జునను ఉద్దేశించి రానా బాలనటుడిగా చేసిన చిత్రాలు ఎన్ని? అని అడగగా అందుకు నాగార్జున సుడిగుండాలు అనే సమాధానం చెబుతారు. ఇంకా అని రానా అడగగా ఇంకా ఉన్నాయా.. అంటూ నాగార్జున ఏమీ తెలియనట్టు అడుగుతారు. సయామీ నటించిన తొలి తెలుగు సినిమా ఏది? అమల గారితో కలిసి నటించిన సినిమాలు ఎన్ని? అని రానా నాగార్జునను ప్రశ్నలు వేయగా అందుకు నాగార్జున సమాధానాలు చెప్పలేకపోయారు.

‘No. 1 యారి’ రానా:

ఈ కార్యక్రమం ద్వారా నాగార్జునను ఉద్దేశించి రానా అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేకపోయి,
నవ్వులు పంచుతున్నారు అక్కినేని నాగార్జున. ఆయన కావాలనే సమాధానం చెప్పలేదా? లేక తర్వాత చెప్పార అనే విషయం తెలియాలంటే ఈ పూర్తి ఎపిసోడ్ మనం చూడాల్సిందే. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోను మాత్రమే విడుదల చేశారు. ఈ కార్యక్రమం పూర్తి ఎపిసోడ్ చూడాలంటే వచ్చే ఆదివారం వరకు ఎదురు చూడాల్సిందే. ఇకపోతే నాగార్జున నటించిన వైల్డ్ డాగ్ సినిమా ఏప్రిల్ 2 న విడుదల కాబోతుంది. ఎన్నో రోజుల నుంచి హిట్ లేక ఉన్న నాగార్జునకు వైల్డ్ డాగ్ సినిమా అయినా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో లేదో వేచి చూడాల్సిందే.


Share

Related posts

మ‌రో కొత్త రంగంలోకి ర‌కుల్ ..!

Siva Prasad

డైరెక్ట‌ర్ అవుతున్న హీరో

Siva Prasad

చిరు టైటిల్‌తో బెల్లంకొండ‌

Siva Prasad