Project K: ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాలలో “ప్రాజెక్ట్ K” ఒకటి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన అమితాబ్… ఇంకా దీపిక పదుకొనే కీలక పాత్రలు చేస్తున్నారు. సూపర్ హీరోస్ తరహాలో సినిమా ఉండనుంది. ఇప్పటివరకు ప్రభాస్ చేసిన అన్ని సినిమాలు కంటే ఇది చాలా డిఫరెంట్. ప్రభాస్ కెరియర్ లోనే అత్యంత హై బడ్జెట్ సినిమా. వైజయంతి మూవీస్ బ్యానర్ లో 50వ సినిమాగా తెరకెక్కిస్తున్నారు. నిర్మాత అశ్విని దత్ చాలా ప్రతిష్టాత్మకంగా “ప్రాజెక్ట్ K”నీ తీసుకోవడం జరిగింది. సినిమా కోసం అంత హాలీవుడ్ టెక్నాలజీతోనే షూట్ చేస్తున్నారు.
అయితే ఈ సినిమా గురించి తాజాగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ మాట్లాడిన ఆడియో నెట్టింట వైరల్ అవుతుంది. “స్క్రిప్ట్ చాలా కొత్తది. ఈ సినిమా కోసం ఒక స్పెషల్ ప్రపంచం క్రియేట్ చేయాలి. అందుకు చాలా టైం పడుతుంది. ఈ సినిమాలో స్పెషల్ గా ఉపయోగించే వాహనాలను కూడా… కొత్తగా తయారు చేసుకోవాల్సిందే. బయట ఎక్కడా కూడా దొరకవు. ప్రత్యేకంగా డిజైన్ చేసుకోవలసి ఉంటుంది. సపోజ్ “మహానటి” అయితే సినిమాలో కార్ కావాలంటే బయట రెంట్ తీసుకోవాలి. కానీ ఈ సినిమాకి అలా కాదు. సినిమా ఎలా చేయాలి అనేదానికి చాలా టైం పడుతుంది. స్టోరీ చాలా కొత్తగా ఉంటుంది అంటూ నాగ్ అశ్విన్ ఈ ఆడియోలో మాట్లాడటం జరిగింది.
దీంతో చాలా వరకు పూర్తిగా సూపర్ హీరో సినిమా లాంటిది అని.. తాజా ఆడియో బట్టి ప్రభాస్ ఫ్యాన్స్ డిసైడ్ అయిపోయారు. మరి ఓవరాల్ గా ఏ రేంజ్ లో సినిమాలో ప్రభాస్ నీ చూపిస్తాడు అన్నది ఇప్పుడు మరింత ఇంట్రెస్ట్ నెలకొంది. ₹500 కోట్ల బడ్జెట్ తో చేస్తున్న ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జే మేయర్. పాన్ ఇండియా నేపథ్యంలో చేస్తున్న ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ప్రస్తుతం ప్రభాస్ “ప్రాజెక్ట్ K” సినిమాతో పాటు “సలార్”, “ఆదిపురుష్” చేస్తున్నారు. ఈ మూడింటిలో “ఆదిపురుష్” ఫస్ట్ రిలీజ్ కానుంది.
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!