కింగ్ నాగార్జున ఆనందానికి అవధులు లేకుండా ఉంది. ఎందుకనో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చైతన్య, సమంత కలిసి నటించిన ‘మజిలీ’ చిత్రం పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కావడమే అందుకు కారణం. చైతన్యకు మంచి హిట్ కావాలని అందరూ ఎదురుచూస్తోన్న తరుణంలో ‘మజిలీ’ రూపంలో హిట్ వచ్చింది. నాగార్జున ప్రత్యేకంగావ వెళ్లి చైతన్య, సమంతలను కలుసుకున్నాడు. కొడుకు, కోడలుతో తన ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకున్నాడు. చై, సామ్‌లతో నాగార్జున కలిసి ఉన్న ఫోటోను పోస్ట్ చేస్తూ బ్లాక్ బస్టర్ కపూల్ అంటూ మెసేజ్ కూడా పోస్ట్ చేశాడు నాగార్జున. ఇప్పుడు చైతన్య ‘వెంకీమామ’తో బిజీగా ఉంటే, సమంత ఓ బేబి సినిమాలో నటించింది. తెలుగులో రీమేక్ కాబోయే తమిళ చిత్రం ’96’ రీమేక్‌లో నటించనుంది సమంత.
previous post