టాలీవుడ్ సినిమా ఫీల్డ్ లో సినిమాలు చేస్తూ వ్యాపారాలు చేసి క్లిక్ అయిన ఫ్యామిలీ అక్కినేని ఫ్యామిలీ. ఇండస్ట్రీలో స్టార్ హీరోగా రాణిస్తూనే మరోపక్క అనేక వ్యాపారాలతో సక్సెస్ ఫుల్ బిజినెస్ మాన్ గా అక్కినేని నాగార్జున రాణించడం జరిగింది. అన్నపూర్ణ స్టూడియోస్ అధినేతగా నిర్మాతగా సినిమా ఫీల్డ్ లో ఎన్నో మైలురాళ్ళు సాధించారు. అటువంటి ఫ్యామిలీ లో కోడలిగా అడుగు పెట్టిన సమంత కూడా….. పెళ్లికాకముందు హీరోయిన్ గా రాణిస్తూనే మరోపక్క ప్రముఖ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించింది.
స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన సమంత…. నాగ చైతన్య తో పెళ్లి అయిన తర్వాత చాలా వరకు గ్లామర్ పాత్రలు తగ్గించి సినిమాలు కంటిన్యూ చేస్తూనే ఉంది. ఎక్కువగా హీరోయిన్ ఓరియెంటెడ్, క్యారెక్టర్ డిమాండ్ చేసే సినిమాలకు సంబంధించిన కథలకు ఓకే చెబుతూ ప్రస్తుతం కెరీర్ కొనసాగిస్తోంది. ఇదే క్రమంలో వెబ్ సిరీస్ లో కూడా నటిస్తూ అక్కడ కూడా విజయాలు సాధిస్తూ సమంత ఓటిటి లో దూసుకుపోతుంది.
ఇదిలా ఉండగా తాజాగా సమంత బట్టల వ్యాపార రంగంలో అడుగుపెట్టింది. “సాకి వరల్డ్” అనే పేరుతో బట్టల వ్యాపారంలో దిగిన కోడలు పిల్ల సమంత కి తోడుగా…. నాగార్జున కూడా రెడీ అయ్యారట. ఈ బట్టల వ్యాపారం లో సమంత మీద నమ్మకంతో నాగ్ భారీగా డబ్బు ఇన్వెస్ట్ చేస్తున్నట్లు సమాచారం. గతంలో ప్రముఖ కంపెనీలకు అంబాసిడర్ గా సమంత రాణించడంతో ఆ నమ్మకంతో కోడలు పిల్ల పెట్టిన వ్యాపారంలో నాగార్జున భారీగా డబ్బు ఇన్వెస్ట్ చేసినట్లు ఇండస్ట్రీలో టాక్.
Bigg Boss Ashwini: రాత్రి 4 అయినా నిద్ర పట్టడం లేదు… బోల్డ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ అశ్విని..!