Naga Chaitanya Chandoo Mondeti: పాన్ ఇండియా స్థాయిలో హిట్ కొట్టేందుకు అక్కినేని వారసుడు, హీరో నాగ చైతన్య తెగ శ్రమిస్తున్నాడు. ఇప్పటి వరకు నాగ చైతన్య నటించిన సినిమాలు కమర్షియల్ హిట్ అందుకున్నాయి. అయితే పాన్ ఇండియా లెవల్‌లో అలరించిన సినిమాలంటూ ప్రత్యేకంగా లేవు. దాంతో ఈ సారి తీయబోయే సినిమా పాన్ ఇండియాలో ఉండాలని, దానికి తగ్గట్లే ప్లాన్ చేసుకుంటున్నాడు. ప్రముఖ డైరెక్టర్ చందూ ముండేటి దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమా చేయబోతున్నారు. దీని కోసం నాగ చైతన్య ప్రత్యేకంగా శిక్షణ కూడా పొందుతున్నాడు. మత్స్యకారుడి జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కబోతుంది.

అందుకే నాగ చైతన్య జాలర్లను కలిసి మాట్లాడటం, వారి జీవన విధానాన్ని తెలుసుకోవడం, సముద్రంలో ఎలాంటి ఆటు పోటులను ఎదుర్కొంటారు, బోటు ఎలా నడుపుతారు, తదితర విషయాలను తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే షూటింగ్ పట్టాలు ఎక్కనుంది. నాగ చైతన్య కెరీర్‌లోనే అతి భారీ బడ్జెట్‌తో తీసుకున్న సినిమా ఇది. చిత్ర యూనిట్ ఈ సినిమాకు ‘తండేల్’ అనే టైటిల్ కూడా పెట్టారు. ఈ సినిమాలో నాగ చైతన్య మత్స్యకారుడిలా కనిపించబోతున్నారు. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ సినిమాకు సంబంధించి చిత్రయూనిట్ కీ అప్డేట్‌ను తెలియజేసింది.

హీరోయిన్‌గా సాయి పల్లవి ఫిక్స్..
తెలుగు వెండితెరపై సాయి పల్లవిని చూసి దాదాపు ఏడాది దాటింది. అప్పుడెప్పుడో వచ్చిన ‘విరాట పర్వం’ సినిమా తర్వాత సాయి పల్లవి ఏ తెలుగు సినిమాల్లో నటించలేదు. తాజా సమాచారం ప్రకారం చందూ ముండేటి దర్శకత్వంలో నాగా చైతన్యకు జోడిగా సాయి పల్లవి నటించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా.. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై తెరకెక్కుతోంది. అయితే సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తున్నట్లు మేకర్స్ ఓ ప్రోమో వీడియోను రిలీజ్ చేశారు. అయితే ఈ ప్రోమోలో సాయి పల్లవి ముఖాన్ని రివీల్ చేయకుండా సస్పెన్స్‌కు క్రియేట్ చేశారు. అయితే సాయిపల్లవి జుట్టు, చేతికి ఉంటే బ్రాస్లెట్ ఆధారంగా సాయి పల్లవి అని తెలుస్తోంది. కాగా సాయి పల్లవి, నాగా చైతన్య కలిసి ‘లవ్ స్టోరీ’ సినిమాలో నటించారు. పల్లెటూరి ప్రేమ కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం భారీ హిట్ అందుకుంది. గొప్పింటి అమ్మాయిగా సాయి పల్లవి, పేదింటి అబ్బాయిగా నాగ చైతన్య చాలా న్యాచురల్‌గా నటించారు. ఈ సినిమాలో ఇద్దరి కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయిందనే చెప్పవచ్చు. దాంతో మరోసారి ఈ జోడిని రిపీట్ చేసి హిట్ కొట్టాలని నిర్మాతలు భావిస్తున్నారు. అందుకే ‘తండేల్’ చిత్రంలో నాగ చైతన్యకు జోడిగా సాయి పల్లవిని తీసుకున్నట్లు తెలుస్తోంది.

‘చందూ ముండేటి’ పాన్ ఇండియా హిట్ ఇస్తాడా?
దర్శకుడిగా, రచయితగా చందూ ముండేటి మంచి పేరు ప్రఖ్యాతలు పొందారు. ఇప్పటివరకు ఈయన దర్శకత్వం వహించిన దాదాపు అన్ని సినిమాలు మంచి హిట్ అందుకున్నాయి. ‘కార్తికేయ’ సినిమాతో దర్శకుడిగా చందూ ముండేటి ఆరంగేట్రం చేశారు. ఆ తర్వాత ‘ప్రేమమ్, సవ్యసాచి, బ్లడీ మేరీ’ సినిమాలు చేశారు. సవ్యసాచి సినిమా నిరాశ పర్చింది. కానీ కార్తికేయ సీక్వెల్ మూవీ ‘కార్తికేయ-2’తో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు. ఊహించని విధంగా ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఆడింది. ఓవర్‌నైట్ హీరో నిఖిల్ కూడా పాన్ ఇండియా హీరో అయ్యారు. ప్రస్తుతం నిరాశలో ఉన్న నాగ చైతన్యకు కూడా పాన్ ఇండియా గుర్తింపు ఎంతో అవసరం. ఎందుకంటే అక్కినేని ఫ్యామిలీ నుంచి ఏ హీరో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందలేదు. దాంతో ఆ ప్రెషర్ అక్కినేని ఫ్యామిలీపై ఉంది. చందూ ముండేటి దర్శకత్వంలో నాగ చైతన్య పాన్ ఇండియా స్థాయిలో హిట్ కొట్టే అవకాశాలు ఉన్నాయి.

‘తండేల్’ సినిమా స్టోరీ ఇలా..
‘తండేల్’ సినిమా పూర్తిగా జాలర్ల చుట్టూ తిరుగుతుంది. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలోని మత్స్యకారులు ఉపాధి కోసం గుజరాత్‌కు వెళ్లి.. అక్కడ అనుకోకుండా ఒక సంఘటనలో చిక్కుకుంటారు. మరీ ఆ విపత్తు నుంచి బయట ఎలా పడతారు. తిరిగి వారి కుటుంబాన్ని కటుసుకుంటారా?. హీరో ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంటాడు? సాయి పల్లవి- నాగ చైతన్య మధ్య ఎలాంటి కెమిస్ట్రీ ఉండబోతుంది? అనే కాన్సెప్ట్‌తో సినిమా తెరకెక్కబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా యధార్థ సంఘటన ఆధారంగా సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే విభిన్న స్టోరీలతో కొత్తగా వచ్చే నాగార్జున కూడా ఈ సారి డిఫరెంట్ కాన్సెప్ట్‌నే టచ్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు కమర్షియల్ హిట్ అందుకున్న నాగ చైతన్య.. పాన్ ఇండియా స్థాయిలో హిట్ కొడతాడా? వేచి చూడాలి.