NewsOrbit
Entertainment News సినిమా

Naga Chaitanya: నాగార్జున కారణంగా ఇండస్ట్రీ ఎంట్రీలో సూపర్ హిట్ సినిమా వదులుకున్న నాగచైతన్య..!!

Share

Naga Chaitanya: అక్కినేని కుటుంబం నుండి నాగచైతన్య వరుస పరాజయాలతో ప్రస్తుతం సతమతమవుతున్నాడు. 2009వ సంవత్సరంలో దిల్ రాజు నిర్మాణ సారధ్యంలో “జోష్” సినిమాతో హీరోగా ఎంట్రీ ఇవ్వడం జరిగింది. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇదిలా ఉంటే చైతు సినిమా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చే సమయాలలో… వరుణ్ తేజ్ నటించిన బ్లాక్ బస్టర్ సినిమా “కొత్త బంగారులోకం”.. స్టోరీ మొదట నాగచైతన్య వద్దకే రావటం జరిగింది అంట. అయితే స్టోరీ మొత్తం విని నాగార్జున రిజెక్ట్ చేయడం జరిగిందంట. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాని దిల్ రాజు నిర్మించారు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది.

Naga Chaitanya gave up the super hit movie in the industry entry due to Nagarjuna

అయితే పక్కా క్లాస్ తో పాటు యూత్ సినిమా కావడంతో చైతన్య కి ఈ స్టోరీ సెట్ కాదని.. నాగార్జున పక్కన పెట్టేసారట. తాజాగా ఈ విషయాన్ని శ్రీకాంత్ అడ్డాల తన కొత్త సినిమా “పెద్దకాపు” ప్రమోషన్ కార్యక్రమంలో తెలియజేయడం జరిగింది. ఇక “జోష్” సినిమా తర్వాత ప్రేమ కథ నేపథ్యంలో సమంతతో తీసిన “ఏ మాయ చేసావే” సినిమాతో నాగచైతన్య మొదటి హిట్ అందుకోవడం జరిగింది. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా… అప్పట్లో యూత్ నీ ఎంతగానో ఆకట్టుకుంది. అనంతరం నాగచైతన్య పలు సినిమాలు చేసి విజయాలు అందుకున్నారు.

Naga Chaitanya gave up the super hit movie in the industry entry due to Nagarjuna

అయితే ఇప్పుడు కెరియర్ పరంగా చూసుకుంటే నాగచైతన్య హిట్ అందుకుని చాలాకాలం అయిపోయింది. ఈ ఏడాదిలో వచ్చిన “కస్టడీ” సినిమా కూడా… బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ప్రస్తుతం నాగచైతన్య చందు మొండేటి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ గోదావరి జిల్లాల పరిసర ప్రాంతాలలో న్యాచురల్ లోకేషన్ లలో షూటింగ్ జరుపుకుంటూ ఉంది. వచ్చే ఏడాది ఈ సినిమా రిలీజ్ కానున్నట్లు సమాచారం.


Share

Related posts

Devatha Serial: రాధని అనుమానించిన మాధవ్..!? దేవిని గ్రిప్ లో పెట్టుకోడానికి రాధ ఏం చేసిందంటే.!?

bharani jella

Prabhas: దిల్ రాజు బ్యానర్ లో బిగ్ ప్రాజెక్ట్ చేయబోతున్న ప్రభాస్..!!

sekhar

Nagarjuna: రూటు మార్చిన నాగార్జున‌.. త్వ‌ర‌లోనే ఫ్యాన్స్‌కి స‌ర్‌ప్రైజ్‌?!

kavya N