Kriti Shetty Naga Chaitanya: అమర ప్రేమికులుగా బయటికి కనపడిన సమంత – నాగ చైతన్యలు సడన్ గా విడిపోయారు. దాంతో అక్కినేని అభిమానులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఏం జరిగింది అని అంతా అనుకొనే లోపే విడాకులు ప్రకటించేసారు. దాని తరువాత అనేకమంది అక్కినేని అభిమానులు సమంతకు మద్దతు ఇవ్వకపోగా, సోషల్ మీడియా వేదికగా అనేక రకాలుగా మిమర్శలు గుప్పించారు. ఓ టైంలో సమంత వాటిని తట్టుకోలేకపోయింది. తరువాత మెల్లగా కోలుకొని ఇపుడు వరుస సినిమాలకు సైన్ చేస్తూ బిజీగా ఉంటోంది.
ఇపుడు హీరో నాగ చైతన్య పరిస్థితి ఏమిటి?
సమంత నుండి విడిపోయిన తరువాత నాగ చైతన్య కూడా సినిమాలతో చాలా బిజీ అయిపోయాడు. తమ విడాకుల తరువాత, వారు నిన్న రామానాయుడు స్టూడియోలో సందడి చేసారు. ప్రస్తుతం నాగ చైతన్య ఆ స్టూడియో సెట్లో (బంగార్రాజు సినిమా) బిజీగా నటిస్తున్నాడు. అలాగే సమంతా తన మహిళా సెంట్రిక్ సినిమా అయినటువంటి యశోద షూటింగ్ కోసం అదే స్టూడియోలో పని చేస్తుంది. తీరా పని పూర్తయిన తర్వాత ఏమి పట్టనట్టు అక్కడి నుంచి వెళ్లిపోయారు. సమంత యశోద అనే రచయిత్రి పాత్రలో సదరు సినిమాలో నటిస్తోంది. ఇది తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రూపొందుతోంది.
మధ్యలో ఈ కృతి శెట్టి ఎక్కడనుండి వచ్చింది?
అదిగో అక్కడికే వస్తున్నా. బంగార్రాజు సినిమాలో నాగ చైతన్య సరసన కృతి శెట్టి నటిస్తున్న విషయం తెలిసినదే కదా. ప్రస్తుతం ఆ స్టూడియోలో నాగ చైతన్యకు కృతి శెట్టికు మధ్య కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. నాగ చైతన్య ఎరుపు రంగు సిల్క్ కుర్తాలో ఉండగా, నటి కృతి శెట్టి గోల్డ్ కలర్ చీరలో సందడి చేశారట. ప్రస్తుతం వీరికి సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దాంతో అందరూ సరదాగా నాగ చైతన్య మళ్ళీ ప్రేమలో పడ్డాడు అంటూ సోషల్ మీడియాలో ఆ ఫోటోని షేర్ చేస్తున్నారు.