Naga Chaitanya: టాలీవుడ్ యువ నటుడు అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం “దూత” అనే వెబ్ సిరీస్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ ఈ వెబ్ సిరీస్ షూటింగ్ కంప్లీట్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు జరుపుకుంటూ ఉంది. డిసెంబర్ మొదటి తారీకు ఈ దూత అనే వెబ్ సిరీస్ విడుదల కానుంది. ప్రియా భవాని, శంకర్, ప్రాచీ దేశాయ్, పార్వతి తిరువోతూ, తరుణ్ భాస్కర్.. ఇతర కీలక పాత్రలలో నటించారు. ఇదిలా ఉంటే తాజాగా స్వదేశంలో ఉండే వరల్డ్ కప్ టోర్నీలో ఫైనల్స్ కి సంబంధించిన నాగచైతన్య కీలక వ్యాఖ్యలు చేస్తూ స్టార్ స్పోర్ట్స్ లో చిన్నపాటి వీడియో విడుదల చేయడం జరిగింది.
విషయంలోకి వెళ్తే తొలి సెమీస్ లో గెలిచే జట్టు గురించి మాట్లాడుతూ.. 2023 వరల్డ్ కప్ చేరిన టీం ఇండియా అంటూ మొదలవుతుంది ఈ ప్రోమో. న్యూస్ పేపర్ చేతుల పట్టుకుని నాగచైతన్య హెడ్ లైన్స్ చదువుతాడు. భవిష్యత్తు డిసైడ్ చేసి తాను చెప్పట్లేదని జట్టు పెర్ఫార్మెన్స్ దూకుడు చూస్తే.. మీకు ఇదే అర్థమవుతుందని వివరించాడు. తాను ఒక్కడినే కాదని ఇండియా మొత్తం ఇదే కోరుకుంటుందని.. టీమిండియా దూతగా జర్నలిస్ట్ సాగర్ అంటూ వీడియోలో ముగించడం జరిగింది. ఈ వార్త సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతూ ఉంది.
ఈ మ్యాచ్ లో భారత్ బాగా రాణించాలని క్రికెట్ ప్రేమికులు దేశవ్యాప్తంగా పూజలు ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. ఈ వరల్డ్ కప్ టోర్నీలో లీగ్ దశలో న్యూజిలాండ్ నీ భారత్ ఓడించటం జరిగింది. అయితే ఇప్పుడు సెమీఫైనల్స్ లో మళ్ళీ ఈ రెండు జట్లు తలపడుతూ ఉండటంతో ఉత్కంఠత నెలకొంది. ముంబై వాంఖాడే స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ కి భారీ ధరలో టికెట్లు అమ్ముడు అయ్యాయి. సెమీఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో.. ఇప్పటికే మాజీ క్రికెటర్లు లెజెండరీ ఆటగాళ్లు తమ అంచనాలను వెల్లడించారు. ఈ రీతిగానే నాగచైతన్య చెప్పిన జోష్యం సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.