Naga Chaitanya : అక్కినేని నాగచైతన్య ఏమిటి? భయపడటం ఏంటి? అని అనుకుంటున్నారా! అవునండి బాబు నాగచైతన్య టెన్షన్ ఎంత తాజాగా తను నటిస్తున్న “లవ్ స్టోరీ” సినిమా గురించ నాగచైతన్య భయం అంతా. వినడానికి ఎంతో ఆశ్చర్యంగా అనిపించినా నాగచైతన్య ప్రస్తుతం ఈ సినిమాని గుర్తు చేసుకొని మరి భయపడుతున్నాడు. శేఖర్ కమల్ లాంటి దర్శకుడు తెరకెక్కించిన సినిమా గురించి నాగచైతన్య భయపడాల్సిన అవసరం లేదని చెప్పవచ్చు.కానీ నాగ చైతన్య భయం అంతా “లవ్ స్టోరీ” సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న “సాయి పల్లవి” గురించి తెగ టెన్షన్ పడుతున్నారు.
సాధారణంగా సాయి పల్లవి ఏ సినిమాలోనైనా నటిస్తే ప్రేక్షకుల ఆసక్తి మొత్తం ఈ ముద్దుగుమ్మ వైపు వెళ్తుంది. ఆ విధంగా సాయి పల్లవి చేసే నటన, డాన్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక్కసారి ఈ భానుమతి రంగంలోకి దిగితే పక్కన ఎవరున్నా సైడ్ అయిపోవాల్సిందే. అంతగా స్క్రీన్ మొత్తం ఆక్రమించుకుంటుంది.అందుకే సాయి పల్లవి నటిస్తున్న సినిమాలో కేవలం సాయి పల్లవి మాత్రమే హైలెట్ గా మారి ఆ సినిమాలలో నటించే హీరోలు మాత్రం సైడ్ అవుతుంటారు.
యూట్యూబ్ లో నెంబర్ వన్ ట్రెండింగ్ అవుతున్న పాట:
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన “ఫిదా” సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే.అయితే ఆ సినిమా క్రెడిట్ మొత్తం హీరో వరుణ్ తేజ్ కి కాకుండా సాయి పల్లవి దక్కించుకున్నారు. అదేవిధంగా నాగసౌర్య హీరోగా తెరకెక్కిన “కణం” సినిమా కూడా సాయి పల్లవి కి మంచి పేరును తెచ్చిపెట్టింది. అయితే మరోసారి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య సరసన “లవ్ స్టోరీ” సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలోసాయిపల్లవి కీలకమైన పాత్ర పోషించడమే కాకుండా, ప్రత్యేకంగా సాయిపల్లవి పై “సారంగ దరియా” అంటూ సాగే పాటను చిత్రీకరించారు. ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో నెంబర్ 1 ట్రేడింగ్ లో ఉంది. ఏది ఏమైనా నాగచైతన్యకు ఇప్పుడప్పుడే సాయిపల్లవి టెన్షన్ వదిలేలా లేదు. అయితే నాగ చైతన్య ఏప్రిల్ 14వ తేదీ వరకు ఈ టెన్షన్ భరించక తప్పదని చెప్పవచ్చు
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!