మళ్లీ రీమేక్‌నే నమ్ముకున్నాడు

Share

ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీలోనూ రీమేక్‌లా హావా నడుస్తుంది. సార్త్ సినిమాలు సౌత్‌లో, సౌత్ సినిమాలు నార్త్‌లో రీమేక్ అవుతున్నాయి. హిట్ కోసం తంటాలు పడుతున్న హీరోలు రీమేక్స్ చేసి హిట్ అందుకుంటున్నారు. గత కొద్ది రోజులుగా సరైన సక్సెస్ లేక సతమతమవుతున్నాడు ఈ అక్కినేని హీరో నాగ చైతన్య. మళయాలం హిట్ మూవీ ప్రేమమ్‌ రీమేక్‌ చేసి హిట్ అందుకున్నాడు.దీని తరువాత ఇప్పటి వరకు మరో హిట్ లేదు. ఇక ఎంతో నమ్మకంతో చేసిన శైలజా రెడ్డి అల్లుడు,సవ్యసాచి సినిమాలు ప్లాప్ అయ్యాయి. అందుకే మరోసారి రీమేక్‌నే నమ్ముకున్నాడట చైతూ.

ఇప్పటి వరకు డైరెక్టర్ప్ మీదున్న నమ్మకంతో సినిమాలు చేస్తున్న చైతూ, ఇకనుంచి కంటెంట్ ఉన్న కథలతోనే సినిమాలు చేయాలని డిసైడ్ అయ్యాడట. అయితే ఇటీవలే వచ్చిన సవ్యసాచి మూవీ కొత్తగా ఉన్నప్పటికి హిట్ మాత్రం కాలేదు.ఇప్పుడు ఈ హీరోకు అర్జెట్‌గా ఓ హిట్ కావాలి. లేదంటే కెరీర్ డైలామాలో పడుతుంది. అందుకే హిట్ కోసం గట్టిగ ట్రై చేస్తున్న చైతూ స్టైట్ సినిమా కాకుండా బాలీవుడ్‌లో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయిన బరైలీ కీ బర్ఫీ రీమేక్‌లో నటించబోతున్నాడని సమాచారం.

ప్రస్తుతం చైతూ శివ నిర్వాణ డైరెక్షన్‌లో మజిలీ మూవీ చేస్తున్నాడు. దాదాపుగా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా సమ్మర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తరువాత బరైలీ కీ బర్ఫీ రీమేక్‌లో నటించనున్నట్లు టాక్. కోన ఫిలిమ్ కార్పొరేషన్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ రీమేక్ హక్కుల్ని సొంతం చేసుకున్నాయి. కోన వెంకట్ తెలుగు నెటివిటికి తగ్గట్టు కథని డైవలప్ చేస్తున్నాడట. అయితే ఈ సినిమాకు దర్శకుడు ఎవరు అనేది త్వరలోనే అనౌన్స్ చేయబోతున్నారు. మరి గతంలో ప్రేమమ్ రీమేక్‌తో సక్సెస్ అందుకున్న చైతూ ఈ మూవీతో ఎలాంటి రిజల్ట్ అందుకుంటాడో చూడాలి.


Share

Related posts

Mahesh Babu : అయ్యబాబోయ్ ‘సర్కారు వారి పాట’ లో మహేష్ డబుల్ యాక్షన్ – ఈ ఒక్క ప్రూఫ్ చాలు ? 

arun kanna

RRR : ఆర్ఆర్ఆర్ నుంచి అదిరిపోయే సర్ప్రైజ్ న్యూస్ వచ్చేసింది..!!

bharani jella

‘సైరా’లో జనసేనాని స్వరం 

Siva Prasad

Leave a Comment