NewsOrbit
Entertainment News సినిమా

Custody Pre Release Event: “కస్టడీ” ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కృతి శెట్టిపై నాగచైతన్య సంచలన కామెంట్స్..!!

Share

Custody Pre Release Event: అక్కినేని నాగచైతన్య కొత్త సినిమా “కస్టడీ” ఈనెల 12వ తారీకు విడుదల కానుంది. ఈ సినిమాలో చైతు కానిస్టేబుల్ పాత్రలో నటించడం జరిగింది. తాజాగా సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. ఈ సందర్భంగా నాగచైతన్య మాట్లాడుతూ…”డైరెక్టర్ వెంకట్రావు గారు ఈ సినిమా స్టోరీ చెప్పగానే… ఆయనను హగ్ చేసుకున్నాను. అంతగా ఈ స్టోరీ నాకు నచ్చింది. ఈ కథ ఇచ్చిన కాన్ఫిడెంట్ తోనే నేను ఇక్కడ ఈరోజు నిలబడ్డాను అని చెప్పుకొచ్చారు. వెంకట్ ప్రభు గారు తమిళంలో ఎన్నో మాస్ సినిమాలు చేయడం జరిగింది. సూర్య, అజిత్, శింబు, కార్తీతో అక్కడ ఎన్నో పెద్ద హిట్ లు అందుకున్నారు. బడ్జెట్ పరంగా ఈ సినిమాను శ్రీనివాస చిట్టూరి గారు నెక్స్ట్ లెవెల్ లో కూర్చోబెట్టడం జరిగింది.

Naga Chaitanya's Sensational Comments on Kriti Shetty at Custody Pre Release Event

అరవింద స్వామి గారు ఈ స్టోరీకి ఓకే చెప్పగానే నాకు మరింత నమ్మకం కలిగింది. ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకునే అవకాశం నాకు ఈ సినిమా ద్వారా లభించింది అని తెలియజేశారు. ఇంకా ఈ సినిమాలో శరత్ కుమార్ ప్రియమణి వంటి సీనియర్ నటీనటులతో చేయటం చాలా సంతోషం అనిపించింది. హీరోయిన్ కృతి శెట్టి ప్రోగ్రామ్స్ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. నాకంటే తెలుగు బాగా మాట్లాడుతుంది. ఆమె కెరియర్ లో కస్టడీ సినిమా నుంచి నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని నమ్ముతున్నాను. కచ్చితంగా ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని నమ్మకం ఉందని.. నాగచైతన్య స్పీచ్ ఇచ్చారు.

Naga Chaitanya's Sensational Comments on Kriti Shetty at Custody Pre Release Event

ఇటీవల అక్కినేని అఖిల్ నటించిన “ఏజెంట్” ఎన్నో అంచనాల మధ్య విడుదలై అట్టర్ ఫ్లాప్ అయ్యింది. దీంతో ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమా నిజం కోసం నిలకడగా నిలబడే ఓ సిన్సియర్ కానిస్టేబుల్ స్టోరీ. ఎప్పుడు నాగచైతన్య టచ్ చేయండి జోనర్ లో… ఫస్ట్ టైం నటిస్తూ ఉండటంతో “కస్టడీ” పై అక్కినేని ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు. పైగా ఈ సినిమాలో చైతు క్యారెక్టర్ పేరు శివ కావటంతో… సెంటిమెంట్ పరంగా హిట్ అవుతుందని నమ్మకంగా ఉన్నారు.


Share

Related posts

New Year Resolutions 2023 : ఈ ఏడాది ఓటీటీ లకు అలవాటైన ప్రేక్షకులను.. 2023లో థియేటర్ లకి రప్పించాలంటే.. ఏం చేయాలి..?

sekhar

Lokesh: తాను చిరంజీవి అభిమానిని అంటూ పాదయాత్రలోకేష్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Puri Jagannath: తీసిన సినిమానే పూరి మళ్ళీ తీస్తున్నాడా..?

GRK