NewsOrbit
Entertainment News సినిమా

Varun Tej Lavanya Tripathi engagement: వరుణ్ తేజ్.. లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ వేడుక పై నాగబాబు ఎమోషనల్ ట్వీట్..!!

Advertisements
Share

Varun Tej Lavanya Tripathi engagement: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి నిశ్చితార్థ వేడుక నిన్న హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. మెగా కుటుంబ సభ్యులు మరియు కొద్దిమంది సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ఈ క్రమంలో వీరి ఎంగేజ్మెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చాలా మంది సెలబ్రిటీలు మరియు ప్రముఖులు ఇంకా అభిమానులు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ క్రమంలో మెగా బ్రదర్ నాగబాబు ట్విట్టర్ లో ఎమోషనల్ ట్విట్ చేశారు.

Advertisements

Nagababu emotional tweet on Varun Tej Lavanya Tripathi engagement ceremony

“నా కొడుకు నిశ్చితార్థం సాక్షిగా… అందమైన వధువును మా కుటుంబంలోకి స్వాగతిస్తున్నప్పుడు నేను భాగోద్వేగాలతో పొంగిపోయా. ఇది గతానికి, వర్తమానానికి వారధిగా ఉండే ఆనందకరమైన క్షణం. అద్భుతమైన ప్రయాణం ప్రారంభిస్తున్న కొత్త జంటకు నా ప్రేమ, ఆశీర్వాదాలు” అంటూ ట్వీట్ చేశారు. దీంతో నాగబాబు చేసిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది కచ్చితంగా గతానికి వర్తమానానికి ఆనందకరమైన క్షణం అనటంతో కూతురు నిహారికను గురించే పరోక్షంగా పెట్టుంటారు అని అంటున్నారు. అంతకుముందు పవన్ కళ్యాణ్ ముందు నడుస్తూ ఉండగా వెనకాల నాగబాబు నడుస్తున్న ఫోటోను తన ట్విట్టర్లో.. షేర్ చేసి..”అతడు పెళ్ళాడుగా ఉన్నప్పుడు… సరిగ్గా ఎలా నడవాలో నేర్పించాను.

Advertisements

Nagababu emotional tweet on Varun Tej Lavanya Tripathi engagement ceremony

ఇప్పుడు మేమిద్దరం పెద్ద వాళ్ళయం. పవన్ కళ్యాణ్ ఉన్నత స్థానాలకు ఎదిగాడు. సరైన మార్గంలో నడిచే అవగాహన సంపాదించాడు. అందుకే నేను అతన్ని అడుగుజాడల్లో నడుస్తున్నాను అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. మెగా కుటుంబంలో జూన్ 9వ తారీకు జరిగిన వరుణ్ తేజ్… లావణ్య త్రిపాఠీల వేడుకకు పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, ఉపాసన, అల్లు అర్జున్, చిరంజీవి, సురేఖ, అల్లు అరవింద్..మరి కొంతమంది సినీ రాజకీయ ప్రముఖులు ఇరుకుటుంబ సభ్యులు హాజరు కావడం జరిగింది. ఇంకా పెళ్లి విషయానికొస్తే ఈ ఏడాది చివరిలో జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.


Share
Advertisements

Related posts

నందు మాటలకు షాక్ అయినా వసుధర.. లాస్య ప్లాన్ వర్క్ అవుట్ అవుతుందా.!?

bharani jella

మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో టబు

Siva Prasad

Divya Bharathi New Gallerys

Gallery Desk