Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం శాకుంతలం.. ఈ సినిమా ఫిబ్రవరి 17 మహాశివరాత్రి కానుకగా రానుంది. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది.. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్స్ సినిమాపై భారీ అంచనాలను నెలకొల్పాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు చిత్ర యూనిట్.. విజువల్ విజువల్ వండర్ గా చూయించిన శకుంతల ట్రైలర్ పై నాగచైతన్య రియాక్షన్ ఏంటంటే.!?
ఈ భూమి మీద అమ్మానాన్నలకు అక్కర్లేని తొలి బిడ్డ.. మేనకా విశ్వామిత్రుల ప్రేమకు గుర్తుగా ఈ బిడ్డ పుట్టింది.. శకుంతల ఒక కారణ జన్మురాలు.. నవ నాగరికతకు నాంది పలకబోతోంది అనే డైలాగ్స్ సమంత పాత్రను ఎలివేట్ చేస్తున్నాయి. మాయ ప్రేమను మరిపిస్తుందేమో.. అభిమానాన్ని, అవమానాన్ని ఏ మాయ మరిపించలేదు’ అంటూ సమంత పలికిన సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి.. మణిశర్మ అందించిన సంగీతం మంచి ఫీల్ ఇస్తుంది. యాక్షన్ సీక్వెన్స్, విజువల్స్ అన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి. ఇక ట్రైలర్ చివర్లో సింహాం మీద అల్లు అర్హ ఎంట్రీ మాత్రం విజిల్స్ వేసేలా ఉంది.. అయితే ఈ ట్రైలర్ చూసిన నాగచైతన్య సినిమా సూపర్ హిట్ అని అన్నాడట. సమంత నటన అద్భుతం అంటూ తన సన్నిహితులతో చర్చించాడని సమాచారం.
ఫిబ్రవరి 17న ఈ సినిమాను 3డీలో రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రాన్ని గుణ టీమ్ వర్క్స్ బ్యానర్‌పై నీలిమ గుణ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించింది. దిల్‌రాజు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు. మలయాళ నటుడు దేవ్ మోహన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. కాగా శాకుంతలం ట్రైలర్ ఈవెంట్ లో గుణశేఖర్ మాట్లాడిన మాటలకు సమంత కన్నీళ్లు పెట్టుకోవడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.