టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీ నుండి నాగార్జున కొడుకుగా వెండితెరకు పరిచయమయ్యాడు నాగచైతన్య. “జోష్” సినిమాతో ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య “ఏ మాయ చేసావే” సినిమాతో అదిరిపోయే హిట్ అందుకోవడం జరిగింది. అంతే కాకుండా ఇదే సినిమాలో హీరోయిన్ గా చేసిన సమంతా ని ప్రేమించి నాగచైతన్య పెళ్లి చేసుకోవడం అందరికీ తెలిసిందే.
ఇండస్ట్రీలో నాగ చైతన్య అనేక విజయాలు సాధించినా కానీ ఆయన తల్లి గురించి పెద్దగా ఎవరికీ ఏమీ తెలియదు. ఈ క్రమంలో తాజాగా ఆహా ప్లాట్ ఫాం కేంద్రంగా సమంత హోస్ట్‌గా చేస్తున్న “సామ్‌జామ్” షో లో సమంతా అడిగిన ఓ ప్రశ్నకు నాగచైతన్య చాలా ఎమోషనల్ సమాధానం ఇచ్చారు. మీ పై మహిళా ప్రభావం ఎంతవరకు ఉంటుందని సమంతా వేసిన ప్రశ్నకు. తనదైన శైలిలో నాగ చైతన్య రిప్లై ఇచ్చాడు. లైఫ్ లో ఏ విధంగా వ్యవహరించాలి అనే దానిపై అమ్మ స్పష్టంగా చెప్పిందని, మనుషులు ఎప్పుడు బ్లాక్ అండ్ వైట్లా ఉండాలని, అటో, ఇటో ఏదో ఒక దారిని మాత్రమే ఎంచుకోవాలని సూచించిందని, తేల్చుకోలేని స్థితిలో మాత్రం ఉండకూడదని బదులిచ్చాడు.
అంతేకాకుండా తన దృష్టిలో స్త్రీ పురుషులు ఇద్దరూ సమానమే అని తేల్చి చెప్పాడు. ఇదిలా ఉంటే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య నటిస్తున్న “లవ్ స్టోరీ” సినిమా త్వరలో విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. సాయి పల్లవితో మొట్టమొదటిసారి నాగచైతన్య నటిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?