బిగ్‌బాస్ 3లో నాగ్‌….


తెలుగు తొలి రియాలిటీ షో బిగ్‌బాస్ రెండు సీజ‌న్స్ ముగిశాయి. ఇప్పుడు మూడో సీజ‌న్ స్టార్ట్ చేయ‌డానికి నిర్వాహ‌కులు నానా తంటాలు ప‌డుతున్నారు. తొలి సీజ‌న్‌కు ఎన్టీఆర్‌, రెండో సీజ‌న్‌కు నాని వ్యాఖ్యాత‌లుగా వ్య‌వ‌హరించిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు ఈ ఇద్ద‌రూ వ్యాఖ్యాత‌లుగా వ్య‌వ‌హ‌రించ‌డానికి నో చెప్పేశారు. దాంతో నిర్వాహ‌కులు టాలీవుడ్ సీనియ‌ర్ స్టార్ హీరో నాగార్జున‌తో సంప్ర‌దింపులు జ‌రుపుతున్నారు. ఇప్ప‌టికే వెండితెర‌పై నాగార్జున మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు ప్రోగ్రామ్‌ను స‌క్సెస్‌ఫుల్‌గా నిర్వ‌హించారు. ఇదే ప్రోగ్రాంను చిరంజీవి సక్సెస్ చేయ‌లేక‌పోయాడు. దీంతో నిర్వాహ‌కులు నాగార్జున అయితే స‌రిపోతాడ‌ని భావిస్తున్నారు. అదీగాక నాగార్జున త‌న స్వంత సినిమాల‌నే చేస్తున్నాడు కాబ‌ట్టి.. డేట్స్‌ను త‌న‌కు అన‌కూలంగా మ‌లుచుకుని కేటాయించ‌వచ్చు. కాబ‌ట్టి నిర్వాహకులు ఎన్టీఆర్ త‌ర్వాత నెక్ట్స్ బెస్ట్ ఆప్ష‌న్ నాగార్జున అని అభిప్రాయంతో ఆయ‌న్ని ఒప్పించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.