సినిమా

Bangarraju: తెల్లారితే `బంగార్రాజు` రిలీజ్..ఇంత‌లో అతి పెద్ద విష‌యం బ‌య‌ట‌పెట్టేసిన నాగార్జున‌!

Share

Bangarraju: టాలీవుడ్ కింగ్ నాగార్జున‌, ఆయ‌న త‌న‌యుడు యువసామ్రాట్ నాగ చైతన్య కలిసి నటించిన తాజా చిత్రం `బంగార్రాజు`. కళ్యాణ్ కృష్ణ కురసాల ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో నాగ్‌కి జోడీగా ర‌మ్య‌కృష్ణ‌, చైత‌న్యకు జోడీగా కృతి శెట్టిలు న‌టించారు. 2016లో విడుదలై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచిన `సోగ్గాడే చిన్నినాయన` చిత్రానికి సీక్వెల్‌గా రూపుద్దుకున్న ఈ మూవీకి అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు.

అన్నపూర్ణా సినీ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై అక్కినేని నాగార్జున స్వ‌యంగా నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 14న గ్రాండ్‌గా విడుద‌ల కాబోతోంది. దీంతో సినిమాపై భారీ హైప్‌ను క్రియేట్ చేసేందుకు మేక‌ర్స్ జోరుగా ప్ర‌మోష‌న్స్ నిర్వ‌హించారు. ఇందులో భాగంగానే.. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న నాగార్జున తెల్లారితే సినిమా రిలీజ్ అన‌గా ఓ అతి పెద్ద విష‌యాన్ని బ‌య‌ట పెట్టారు.

ఇంత‌కీ ఆయ‌న ఏం చెప్పారంటే.. ఈ చిత్రంలో నాగ‌చైత‌న్య‌కు తాత‌, తండ్రులుగా నాగార్జున క‌నిపిస్తాడు. మొదట స‌న్నివేశంలోనే తండ్రి పాత్ర మాయ‌మై.. మ‌ళ్లీ క్లైమాక్స్ లో వ‌స్తుంద‌ట‌. ఇక సినిమా మొత్తం తాత నాగార్జున‌, మ‌న‌వ‌డు చైతులే ఉంటారు. అయితే ఇక్క‌డ ఆస‌క్తిక‌ర విష‌యం ఏంటంటే.. సినిమాలో నాగార్జున కంటే నాగ‌చైత‌న్య‌నే ఎక్కువ‌గా క‌నిపిస్తాడు. నాగార్జున సినిమా అంతా ఉంటారు. కానీ తెరపై కనిపించేది మాత్రం నాగ చైతన్యనే. ఆత్మలా లోపలకి వెళ్లినప్పుడు నాగార్జునను చూపించలేరు కదా?. అందుకే ఎక్కువగా చైతూనే కనిపిస్తాడ‌ట. ఈ విష‌యాన్ని నాగార్జున స్వ‌యంగా వెల్ల‌డించారు. అంటే ఈసారి బంగార్రాజు.. చైతూనే అని, ఆయ‌న‌కు సపోర్ట్ చేసే పాత్ర‌లో నాగ్ క‌నిపిస్తాడ‌ని స్ప‌ష్టంగా అర్థ‌మైంది.


Share

Related posts

NTR: బాలీవుడ్ లో రీమేక్ చేయాలనుకుంటే కచ్చితంగా ఆ సినిమా చేస్తా ఎన్టీఆర్ షాకింగ్ కామెంట్స్..!!

sekhar

ఇక్కడ హిట్ కొట్టిన సినిమా అక్కడ బోల్తా పడుతుందని ఎలా అంటారు ..?

GRK

ఎన్టీఆర్ కు అత్త‌గా సీనియ‌ర్ స్టార్ హీరోయిన్‌.. నెట్టింట క్రేజీ న్యూస్ వైర‌ల్‌!

kavya N