ప్రస్తుతం యాక్టర్స్ అందరూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్నారు. వారి వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన ముఖ్యమైన విషయాలతో పాటు వారు నటించే సినిమా విశేషాలను కూడా సోషల్ మీడియాలో అకౌంట్స్ ద్వారా వెల్లడిస్తుంటారు. సాధారణంగా సోషల్ మీడియాలో పేస్ బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వంటి చాలా మాధ్యమాలున్నాయి. అయితే అందరూ, అన్నీ మాధ్యమాల్లోనూ యాక్టివ్ ఉండరు. అయితే దీన్ని కొందరు వారి స్వలాభానికి వాడేసుకుంటున్నారు.
ఇలా చెప్పడం వెనుక అసలు కారణమేమంటే.. నాగార్జునకు సోషల్ మీడియాలో ఫేస్ బుక్, ట్విట్టర్లో అధికారికంగా అకౌంట్స్ ఉన్నాయి. ఇన్స్టాగ్రామ్లో లేదు. దీన్ని సానుకూలంగా తీసుకున్న ఓ వ్యక్తి ఐయామ్ నాగార్జున అనే పేరుతో ఓ ఫేక్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేశాడు. అందులో నాగార్జున సినిమాకు సంబంధించిన సినిమాల విశేషాలను, వీడియోలను పోస్ట్ చేయడం స్టార్ట్ చేశాడు. అది ఫేక్ అకౌంట్ అని తెలియని అక్కినేని అభిమానులు దాన్ని ఫాలో కావడం మొదలు పెట్టారు. ఈ విషయం నాగార్జునకు చేరింది. దాంతో ఆయన వెంటనే రియాక్ట్ అయ్యారు. ఇన్స్టాగ్రామ్లో తనకు అకౌంట్ లేదని, తన పేరుతో ఉన్న అకౌంట్ పేక్ అకౌంట్ అని, తాను ఇన్స్టాలో అకౌంట్ ఓపెన్ చేస్తే అందరికీ చెబుతానని కూడా చెప్పి అక్కినేని అభిమానులకు క్లారిటీ ఇచ్చేశారు.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!