Bangarraju Review: “బంగార్రాజు” మూవీ రివ్యూ..!!

Share

Bangarraju Review: సరిగ్గా ఆరు సంవత్సరాల క్రితం కళ్యాణ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన “సోగ్గాడే చిన్ని నాయన” సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. దీనిలో నాగార్జున డబల్ ఫోజ్ లో కనిపించి రమ్యకృష్ణతో.. కీలక పాత్ర పోషిస్తూ యంగ్ నాగార్జునకి సాయం చేస్తూ ఉంటాడు. ఇప్పుడు అదే ఫార్ములాతో తెరకెక్కిన సినిమా బంగార్రాజు. ఒకసారి ఈ సినిమా యొక్క పాజిటివ్ నెగిటివ్ ఏంటో ఓ లుక్కేద్దాం.

Bangarraju Trailer: Ideal Festival Entertainer

నటీనటులు :

నాగార్జున, కృతిశెట్టి, రమ్య కృష్ణ, నాగచైతన్య, రావు రమేష్, సంపత్ రాజ్, వెన్నెల కిశోర్.

Bangarraju (Akkineni Nagarjuna, Naga Chaitanya) - Stlls - IndustryHit.Com
స్టోరీ:

కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తాజాగా “బంగార్రాజు” తెరకెక్కిన సంగతి తెలిసిందే. “సోగ్గాడే చిన్నినాయన” సినిమాకి కొనసాగింపుగా తెరకెక్కిన ఈ సినిమా… సంక్రాంతి పండుగ సందర్భంగా ఈరోజు రిలీజ్ అయింది. “బంగార్రాజు” టైటిల్ క్యారెక్టర్ లో నాగార్జున నటించడం జరిగింది. అదృశ్య శక్తుల తో చిన్న బంగార్రాజు పాత్రలో నటించినా నాగచైతన్యకి నాగార్జున సినిమాలో సాయం చేస్తూ ఉంటాడు. “శివపురం” అనే గ్రామంలో చిన్న బంగార్రాజు అనగా నాగచైతన్య ప్లే బాయ్.. మాదిరిగా వ్యవహరిస్తూ ఉంటాడు. లోకల్ సర్పంచ్ నాగలక్ష్మి పాత్రలో నటించిన కృతి శెట్టి తో.. పెద్దగా పడదు.  ఈ క్రమంలో శివపురం గ్రామంలో ఉన్న దేవాలయాల ఆస్తులపై కొంతమంది దుండగులు చూపు పడతది. అయితే చిన్న బంగార్రాజు ని అంతమందిస్తే గాని.. దేవాలయాలను దోచుకోవడం సాధ్యపడదని విలన్లు అనేక పన్నాగాలు పన్నుతూ ఉంటారు. దీంతో “బంగార్రాజు” భూమ్మీద కి అదృశ్య శక్తుల ద్వారా వచ్చి చిన్న బంగార్రాజు కి.. వ్యక్తిగతంగా అదేరీతిలో విల్లన్ లకు వ్యతిరేకంగా.. ఎలా కాపాడతాడు..? అనేదే ఈ “బంగార్రాజు” సినిమా స్టోరీ.

Promotions begin for Bangarraju
పెర్ఫార్మెన్స్:-

ఓవరాల్ గా సినిమా కి.. నాగార్జున పాత్ర హైలెట్ గా మాత్రమే కాక.. ప్రేక్షకులను సినిమా స్టోరీ కి కనెక్ట్ చేసే రీతిలో ఉంది. ప్రతి ఫ్రేమ్లో నాగార్జున తన హండ్రెడ్ పర్సెంట్.. చరిష్మా తో.. స్టోరీకి కీలకంగా మారాడు. ఇక నాగచైతన్య పాత్ర కు వస్తే.. అంతగా ఏమీ లేకపోయినా కానీ నాగార్జున ఎంటర్ అయ్యే సమయంలో చైతు పాత్రకి మంచి వెయిటేజీ స్క్రీన్ పై కనబడింది. కృతి శెట్టి నాగలక్ష్మి పాత్రలో నటించిన పెద్దగా.. పాత్రకి వెయిటేజీ ఏమీ లేదు. ఏదో నామమాత్రంగా అన్నట్టు.. టాక్. ఒరిజినల్ వెర్షన్ లో నటించిన రమ్య అప్పటి ఇంపార్టెన్స్ రోల్ ఈ కనబడలేదని టాక్. ఇంకా రావు రమేష్, సంపత్ రాజ్, వెన్నెల కిషోర్, ఝాన్సీ.. ఇది నామమాత్రంగా ఉన్నట్లు చూసిన వాళ్ళు చెబుతున్నారు.

Hint of supernatural in 'Bangarraju' trailer - DTNext.in
దర్శకుడు పనితీరు:

కళ్యాణ్ కృష్ణ.. ఐదు సంవత్సరాల గ్యాప్ తర్వాత.. కొత్తదనంతో కాకుండా రొటీన్ సేఫ్ జోన్ తరహాలోనే సినిమా స్టోరీ నడిపించాడు. సినిమా మొత్తానికి నాగార్జున బంగార్రాజు క్యారెక్టర్ హైలెట్ చేయడం అక్కినేని అభిమానులను ఆకట్టుకునే రీతిలో సినిమాను నడిపించాడు. సోగ్గాడే చిన్ని నాయన సినిమాయే కనిపిస్తూ ఉంటాయి ఒక్క నాగచైతన్య పాత్ర ని పరిచయం చేయడం తప్ప మిగతాదంతా.. రొటీన్ గానే కనిపించింది. సోగ్గాడే చిన్ని నాయన.. బంగార్రాజు సినిమాకి పెద్దగా తేడా ఏమీ లేదని చూసిన జనాలు అంటున్నారు. ఫస్టాఫ్ గంటలో కొద్దిగా ట్విస్టులతో ఎంటర్టైన్మెంట్ పాత్ర ఉండగా మిగతా సెకండాఫ్ కంటిన్యూ కూడా అదే రీతిలో.. స్టోరీ నడిపించటం జరిగింది. క్లైమాక్స్ పార్ట్ లో . సీనియర్లను అదేరీతిలో నాగార్జున రమ్యకృష్ణ.. పెర్ఫార్మెన్స్.. స్టోరీ నడిచే విధానం ఓవరాల్ గా ఓకే అనిపించింది.

హైలెట్స్:

నాగార్జున.

సినిమాటోగ్రఫీ.

సాంగ్స్ (వీడియో)

విలేజ్ బ్యాక్ గ్రౌండ్.

Bangarraju movie starring Nagarjuna will release on January 14th only if everything goes well! - Moviezupp
డ్రాబ్యాక్స్:-

కథలో కొత్తదనం కనబడలేదు.

పెద్దగా ఎమోషనల్ టచ్ కూడా లేదు.

కామెడీ అంతంతమాత్రంగానే.

 

రిజల్ట్:
సంక్రాంతి పండుగ కానుకగా ఆరు సంవత్సరాల క్రితం వచ్చిన “సోగ్గాడే చిన్నినాయన”తో.. పోల్చి “బంగార్రాజు” కి సినిమాకెళ్తే నిరాశ పడతారు. 


Share

Related posts

Chakra movie release date : ఇంకొక టాప్ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఇక సినిమా లవర్స్ కి పండగే..

bharani jella

Priya Bhavani Shankar Latest Photos

Gallery Desk

Pooja Hegde Latest images

Gallery Desk