Bigg Boss 7 Telugu: రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ సెవెన్ ముస్తాబవుతుంది. కొద్ది రోజుల క్రితం లోగో రిలీజ్ చేయగా తాజాగా… వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియోలో హోస్ట్ నాగార్జున అని స్పష్టం చేయడం జరిగింది. ఇప్పటివరకు ఆరు సీజన్ లు ముగియగా త్వరలోనే ఏడవ సీజన్ ప్రసారం కావడానికి సిద్ధమవుతోంది. ఈ క్రమంలో నేడు బిగ్ బాస్ సెవెన్ ప్రోమో మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రోమోలో నాగార్జున దర్శనమిచ్చారు. ఆరవ సీజన్ కంప్లీట్ అయిన తర్వాత బిగ్ బాస్ షోకి కొత్త హోస్ట్ రాబోతున్నట్లు తెలియజేశారు. బాలకృష్ణ లేదా విజయ్ దేవరకొండ ఇంకా రానా పేర్లు కూడా వినిపించాయి.
కానీ సీజన్ సెవెన్ కి కూడా నాగార్జున కంటిన్యూ కాబోతున్నట్లు తాజా ప్రోమో ద్వారా క్లారిటీ ఇవ్వటం జరిగింది. నాలుగు సీజన్ నుంచి నాగార్జున యే హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఇక ఏడవ సీజన్ కూడా ఆయన కావటంతో అక్కినేని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా రిలీజ్ చేసిన సీజన్ సెవెన్ ప్రోమోలో నాగార్జున స్టైలిష్ లుక్ లో అదరగొట్టారు. చేతిలో పాప్ కార్న్ డబ్బా పట్టుకుని.. బిగ్ బాస్ సీజన్ సెవెన్.. ఈసారి ఏం చెప్పాలి.. చాలా కొత్తగా చెప్పాలి హా కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్.. అంటూ చిటికె వేయగానే అక్కడ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ ఒక్కసారిగా రివర్స్ అవడం చూపించారు.
దీంతో ఈ సీజన్ లో మేకర్స్ ఏదో కొత్తగానే ట్రై చేస్తున్నట్లు ప్రోమో ద్వారా తెలియజేయడం జరిగింది. బిగ్ బాస్ సీజన్ సెవెన్.. కొత్త ప్రోమో నెట్టింట వైరల్ అవుతుంది. ఈ ఏడాది వన్డే క్రికెట్ వరల్డ్ కప్ టోర్నీ జరుగుతున్న క్రమంలో ముందుగానే షో స్టార్ట్ చేయాలని మేకర్స్ డిసైడ్ అయినట్లు టాక్. ఇక ఈసారి హౌస్ లో ఎంట్రీ ఇచ్చే సభ్యులు.. చాలా పాపులర్ అయిన వారిని మేకర్స్ తీసుకున్నట్లు టాక్. ఆగస్టు నెలలో స్టార్ట్ చేసి నవంబర్ నాటికి కంప్లీట్ చేసే రీతిలో నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
CPI Narayana: సీఎం జగన్ తో చిరంజీవి భేటీపై కీలక వ్యాఖ్యలు చేసిన సీపీఐ నారాయణ..! ఆ పాయింట్ కరెక్టేగా..?