ఆ కుర్ర హీరో ని ఆదుకోవడానికి రెడీ అయిన నాగ్..??

టాలీవుడ్ ఇండస్ట్రీలో “ఉయ్యాల జంపాల” అనే సినిమాతో మొదటి విజయాన్ని సాధించి తెలుగులో మంచి గుర్తింపు పొందాడు కుర్ర హీరో రాజ్ తరుణ్. ఆ తర్వాత చేసిన సినిమాలు పెద్దగా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించిక పోవటంతో రాజ్ తరుణ్ విజయం చూసి చాలా కాలమైంది.  వరుసగా నాలుగు సంవత్సరాల నుండి ఒక్క హిట్టు కూడా లేదు. దీంతో వరుస ఫ్లాపులతో రాజ్ తరుణ్ మార్కెట్ చాలా వరకు డాల్ అయ్యింది.

కుర్ర హీరోకు లిఫ్ట్ ఇస్తున్న నాగార్జున‌!అదే టైమ్ లో బాక్స్ ఆఫీస్ కూడా  ఈ కుర్ర హీరో ని సీరియస్ గా  తీసుకోవటం లేదు అన్న కామెంట్లు ఇటీవల వినబడుతున్నాయి . పరిస్థితి ఇలా ఉండగా ఈ కుర్రహీరో ని ఆదుకోవటానికి  కింగ్ నాగార్జున  రెడీ అయినట్లు ఫిలింనగర్ లో వార్తలు వస్తున్నాయి. పూర్తి విషయంలోకి వెళితే “ఉయ్యాల జంపాల” నిర్మాత నాగార్జున  ఒకరు. ఆ సినిమా మంచి విజయం సాధించడంతో  హీరో రాజ్ తరుణ్ కి నాగార్జున కి మధ్య మంచి సంబంధాలే ఉన్నాయి.

 

ఆ తర్వాత రంగుల రత్నం తో మరో అవకాశం ఇచ్చారు. కాగా ప్రస్తుతం రాజ్ తరుణ్ కెరియర్ చాలా డౌన్ లో ఉండటంతో నాగార్జున రాజ్ తరుణ్ ని హీరోగా పెట్టి మరో సినిమా నిర్మించడానికి రెడీ అయినట్లు టాక్ వస్తుంది. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సమాచారం. అంతే కాకుండా ఇటీవల అవకాశం ఉంటే వెబ్ సిరీస్ చేయటానికి కూడా రెడీగా ఉన్నట్లు రాజ్ తరుణ్ మరోపక్క స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మొత్తం మీద సరైన హిట్ లేక పోవటం తో రాజ్ తరుణ్ కెరియర్ పై నీలినీడలు కమ్ముకున్నాయి.