Nagarjuna: సినిమా టికెట్ల వ్యవహారంలో ఇన్ డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ కి సెటైర్లు వేసేసిన నాగార్జున..??

Share

Nagarjuna: సినిమా టికెట్ల వ్యవహారం ఏపీ రాజకీయాలను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఇప్ప చాలా మంది హీరోలు అదేరీతిలో డైరెక్టర్లు మరియు నిర్మాతలు టిక్కెట్ ధరలను ఏపీ ప్రభుత్వం తగ్గించటం పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో టిక్కెట్ల ధరల బట్టి చూస్తే సినిమా నిర్మించడం కష్టం అని చెబుతున్నారు. కొంతమంది దర్శకులు  సినిమా చూసే ప్రేక్షకుడికి లేని బాధ ప్రభుత్వానికి ఎందుకు అంటూ విమర్శలు చేస్తున్నారు. హీరో నాని(Nani) అదేవిధంగా సిద్ధార్థ మరియు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ(Ramgopal Varma) ఏపీ ప్రభుత్వం పై సీరియస్ కామెంట్లు చేయడం తెలిసిందే. వీరందరి కంటే ముందుగా పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సాయి ధరమ్ తేజ్(Saidharam Tej) నటించిన “రిపబ్లిక్”(Republic) సినిమా ప్రీ రిలీజ్ వేడుకలలో… వైసీపీ(YCP) పార్టీ అంటూ టికెట్ల ధరల వ్యవహారాన్ని దుమ్మెత్తిపోశారు.

Nagarjuna Keeps Personal & Business Interests Above Industry

ఇటువంటి తరుణంలో తాజాగా కింగ్ నాగార్జున బంగార్రాజు ఈ సినిమా విడుదల తేదీ కి సంబంధించి మీడియా సమావేశంలో టికెట్ ధరల విషయంలో తనదైన శైలిలో స్పందించారు. ఈ సందర్భంగా ఏపీలో సినిమా టికెట్ ధరలు తగ్గించడం పట్ల మీ స్పందన ఏమిటి అని ఓ ప్రముఖ మీడియా ఛానల్ కి చెందిన విలేకరి నాగార్జున ని ప్రశ్నించగా.. ఏపీలో సినిమా టికెట్ రేట్ తగ్గించటం వల్ల తనకు ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పుకొచ్చారు. టికెట్ ధర ఎక్కువగా ఉంటే తమకు ఎక్కువ డబ్బులు వస్తాయని… తక్కువ ధర ఉంటే తక్కువ డబ్బులు వస్తాయని తెలిపారు.

Pawan Kalyan attends Republic pre-release event, reveals Sai Dharam Tej is 'still in coma' | Entertainment News,The Indian Express

ఇక ఇదే క్రమంలో… సినిమా స్టేజీల పైన పొలిటికల్ విషయాలు మాట్లాడకూడదు, నేను మాట్లాడను అంటూ మరింతగా సినిమా టికెట్ల విషయంలో.. విలేకరి నుండి వస్తున్న రకరకాల ప్రశ్నలకు నాగార్జున ఈ రీతిలో సమాధానమిచ్చారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో రావడంతో చాలా మంది నెటిజన్లు అప్పట్లో సాయి ధరమ్ తేజ్ “రిపబ్లిక్” రిలీజ్ వేడుకలు పవన్ కళ్యాణ్ స్టేజీపైన పొలిటికల్ కామెంట్లు చేయడం తో దానికి ధీటుగా నాగార్జున(Nagarjuna) కౌంటర్ ఇచ్చినట్లు ఉందని.. కామెంట్లు చేస్తున్నారు. ఇక ఇదే క్రమంలో భారీ బడ్జెట్ సినిమాలు RRR, రాధేశ్యాం.. చాలా సంవత్సరాలు షూటింగ్ జరుపుకునే సినిమా వాయిదా వేయటం తనకు ఎంతగానో బాధ కలిగిస్తుందని తెలిపారు. పాన్ ఇండియా సినిమాలు కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో… రిలీజ్ చేయకపోవడమే మంచిదని స్పష్టం చేశారు.


Share

Related posts

Guppedentha manasu Jan 10 today episode:ప్రేమ లేఖతో అడ్డంగా బుక్ అయిన ఈగో మాస్టర్…ఎలా కవర్ చేస్తాడో చూడాలి మరి..!

Ram

నెగటివ్ టాక్ తో కూడా కాసుల వర్షం కురిపిస్తున్నాడు

Siva Prasad

Pawan kalyan – Ajith: పవర్ స్టార్‌తో పోటీనా..అయితే కష్టమే..!

GRK