కింగ్ నాగార్జున టైటిల్ రోల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘వైల్డ్ డాగ్’. ‘మన్మథుడు 2’ వంటి భారీ ఫ్లాప్ తరువాత నాగార్జున నటిస్తున్న సినిమా మళ్ళీ బ్లాక్ బస్టర్ అందుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా కొంత భాగం టాకీ పార్ట్ ని కంప్లీట్ చేసుకోగా కరోనా కారణంగా చిత్రీకరణ ని నిలిపివేశారు. ఇక త్వరలో మళ్ళీ ఈ సినిమాని మొదల పెట్టబోతున్నట్టు షెడ్యూల్ ని థాయిలాండ్ లో ప్లాన్ చేస్తున్నట్టు ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే ఇంకా అధికారకంగా ఇందుకు సంబంధించిన న్యూస్ రాలేదు.
ఇక నాగార్జున నటిస్తున్న ‘వైల్డ్ డాగ్’ సినిమాని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై లో నిర్మిస్తుండగా అహిషోర్ సాల్మోన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆసక్తిగా ఉంది. బాలీవుడ్ లో భారీ తారాగణంతో రూపొందుతున్న ‘బ్రహ్మాస్త్ర’ అనే సినిమాలో ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. అంతేకాదు టాలీవుడ్ లో క్లాస్ చిత్రాల దర్శకుడిగా పాపులారిటీని సంపాదించుకున్న శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నట్టు సమాచారం.
అయితే విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం ప్రకారం నాగార్జున బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా హిందీ రైడ్ రీమేక్ లో నటించబోతున్నారట. హిందీలో అజయ్‌దేవ్‌గణ్ , ఇలియానా జంటగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాపీస్ వద్ద మంచి వసూళ్ళను రాబట్టింది. ఇక రైడ్ తెలుగులో రీమేక్ చేసేందుకు నాగార్జున సన్నాహాలు చేస్తుండగా నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్, గరుడ వేగ ఫేం ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించనున్నాడని తాజా సమాచారం. ఇక ఈ సినిమాలో నాగార్జున కి జంటగా ఇలియానా నటించే అవకాశాలున్నాయి.